Agniveer Notification 2022: అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవిగో..

Indian Airforce Agniveer Notification 2022: దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా... విపక్షాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా అగ్నిపథ్ పథకంపై దూకుడు పెంచింది కేంద్రం. అగ్నిపథ్ కింద నియామకాల ప్రక్రియ మొదలుపెట్టేసింది.

Written by - Srisailam | Last Updated : Jun 21, 2022, 12:18 PM IST
  • అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల
  • జూన్ 24 నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్
  • జూలై 5 చివరి తేది
Agniveer Notification 2022: అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవిగో..

Indian Airforce Agniveer Notification 2022: దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా... విపక్షాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా అగ్నిపథ్ పథకంపై దూకుడు పెంచింది కేంద్రం. అగ్నిపథ్ కింద నియామకాల ప్రక్రియ మొదలుపెట్టేసింది. అగ్నిపథ్ కింద అగ్నివీర్ నియామకాలం కోసం సోమవారం ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఇవాళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్ మెంట్ 2022 నోటిఫికేషన్ విడుదలైంది.

18 నుంచి 23 సంవత్సరాల వారు ఈ పోస్టులకు అర్హులు. అంటే డిసెంబర్ 29, 1999 నుంచి 29 జూన్ 2005 మధ్య జన్మించిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ రోజుకు అభ్యర్థి వయసు 23 సంవత్సరాలు దాటకూడదు. ఇందుకోసం అర్హులైన అభ్యర్థులు రిక్రూట్​మెంట్​ వెబ్​సైట్​లో https://careerindianairforce.cdac.in లో ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి. జూన్ 24 ఉదయం 10 నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది. జూలై 5వ తేదీ చివరి తేది. ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ల నియామకం కోసం జూలై 24న రాత పరీక్ష జరగనుంది. ఇక ఈ నెల 24న అగ్నిపథ్ పథకంలో భాగంగా ఇండియన్ నేవీలో అగ్నివీర్ల నియామకం కోసం నోటిఫికేషన్‌‌ విడుదల కానుంది.

అగ్నివీర్‌ పోస్టుకు పరీక్ష ఫీజు 2 వందల యాబై రూపాయలు. అభ్యర్థి ఆన్‌లైన్ లోనే చెల్లించాలి. గేట్‌వే ద్వారా డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్ ఆన్ లైన్ బ్యాంకింగ్ ఉపయోగించి డబ్బులు చెల్లించవచ్చు. యాక్సిస్ బ్యాంక్ లో చలానా ద్వారా కూడా అగ్నివీర్ పరీక్ష రుసుము కట్టవచ్చు. అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ కు దరఖాస్తు చేసే అభ్యర్థులు కనీస ఎత్తు 152.5 సెంటిమీటర్లు. ఛాతీ కనిష్ట విస్తరణ పరిధి 5 సెంటమీటర్లు. బరువు ఎత్తు, వయస్సుకు తగ్గట్లు ఉండాలని నోటిఫికేషన్ లో తెలిపార. కార్నియల్ సర్జరీ జరిగి ఉంటే అనర్హులు. వినికిడి సామర్ధ్యం బాగుండాలి. ఆరోగ్యకరమైన చిగుళ్ళు, మంచి దంతాలతో కనీసం 14 డెంటల్ పాయింట్లు ఉండాలి.

కేంద్ర ప్రభుత్వం జూన్ 14న అగ్నిపథ్​ పథకాన్ని ప్రకటించింది. ఈ స్కీమ్​ కింద 17.5 సంవత్సరాల నుంచి 21 ఏండ్ల మధ్య వయస్సు గల యువకులను నాలుగు సంవత్సరాల కాలానికి ఎంపిక చేసుకుంటారు. మొదటి దశ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం మాత్రం ఏజ్ లిమిట్ ను 23 ఏండ్లకు పొడిగించింది కేంద్రం. 4 ఏళ్లు పని చేసిన తర్వాత ఎంపికైనా వారిలో 25 శాతం మందిని మరో 15 సంవత్సరాల పాటు కొనసాగిస్తారు. 

Read also: International Yoga Day 2022: యోగాతో విశ్వ శాంతి.. మైసూర్‌ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ...  

Read also: Hyderabad Weather Updates : నగరం నలుమూలలా భారీ వర్షం.. తడిసి ముద్దయిన హైదరాబాద్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News