కేదార్‌నాథ్‌ సమీపంలో కూలిన వాయుసేన విమానం

భారత వాయుసేనకు చెందిన మిగ్‌ 17 హెలికాప్టర్‌ ఈరోజు ఉదయం కూలిపోయింది.

Last Updated : Apr 5, 2018, 08:57 AM IST
కేదార్‌నాథ్‌ సమీపంలో కూలిన వాయుసేన విమానం

ఢిల్లీ: భారత వాయుసేనకు చెందిన మిగ్‌ 17 హెలికాప్టర్‌ ఈరోజు ఉదయం కూలిపోయింది. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ సమీపంలో హెలీకాప్టర్‌ కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో పైలట్‌ సహా హెలికాప్టర్‌లో ఉన్న నలుగురు స్వల్పంగా గాయపడ్డారని, వారంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఉదయం 8.10 నిమిషాల సమయంలో ప్రమాదం జరిగినట్లు చెప్పారు. కేదార్‌నాథ్‌ సమీపంలోని హెలిప్యాడ్‌లో మిగ్‌ 17ను ల్యాండ్‌ చేస్తుండగా ఐరన్‌ గిడ్డర్‌కు తగిలి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు.

 

ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి.. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. కాగా, ఎంఐ-17 హెలికాప్టర్లను రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది.

Trending News