S400 Missiles: భారత రక్షణ వ్యవస్థ మరింతగా పటిష్టం కానుంది. సుదూర లక్ష్యాల్ని ఛేధించడం, గగనతలం ముప్పును ఎదుర్కోవడంలో కీలకమైన ఎస్ 400 క్షిపణులు ఇండియాకు పంపీణీ ప్రారంభమైంది.
భారతదేశం క్రమంగా రక్షణ వ్యవస్థను(Indian Defence System) పటిష్టం చేసుకుంటోంది. ఉపరితలం నుంచి గగన తలంలోని లక్ష్యాలను ఛేదించే ఎస్ 400 క్షిపణుల సరఫరాను రష్యా (Russia)ప్రారంభించింది. భారత్‌కు ఈ క్షిపణులను అందిస్తున్నామని రష్యా ఫెడరల్ సర్వీస్ ఫర్ మిలటరీ టెక్నికల్ కోపరేషన్ డైరెక్టర్ దిమిత్రి షుగావ్ తెలిపారు. ముందుగా అనుకున్న ప్రకారమే భారత్‌కు ఎస్ 400 క్షిపణుల్ని సరఫరా చేసే ప్రక్రియ ప్రారంభమైందని దుబాయ్ ఎయిర్ షో ప్రారంభానికి ముందు ఆయన వెల్లడించారు. సుదూర లక్ష్యాలను ఛేదించడంలో, గగనతలం నుంచి వచ్చే ముప్పుని ఎదుర్కోవడంలో ఎస్ 400 క్షిపణుల సామర్ధ్యం చాలా గట్టిది.
ఎస్ 400 క్షిపణులు ఎందుకు
మొదటి క్షిపణిని చైనాతో సంక్షోభం(China Crisis)తలెత్తిన లద్దాఖ్ సెక్టార్లో మెహరించాలని భారత వాయుసేన భావించినట్టు తెలుస్తోంది. మరోవైపు చైనా, పాకిస్తాన్ల నుంచి ఏకకాలంలో వచ్చే ముప్పుని ఎదుర్కోవడానికి వీలుగా పశ్చిమ ప్రాంతంలో ఈ క్షిపణుల్ని మోహరించే ఉద్దేశముంది. చైనా ఇప్పటికే రెండు ఎస్ 400 రెండు క్షిపణుల్ని(S 400 Missiles)లద్దాఖ్, అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దుల్లో మోహరించింది. 2018లో 35 వేల కోట్లతో 5 ఎస్ 400 క్షిపణుల కొనుగోలుకు రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. సముద్రం, గగనతలం మీదుగా ఈ క్షిపణుల అందనున్నాయి. ఈ ఏడాది చివరికి మొత్తం 5 క్షిపణులు భారత్‌కు చేరనున్నాయి. ఇప్పటికే ఈ క్షిపణుల వినియోగంపై భారత వైమానిక దళం అధికారులకు శిక్షణ కూడా పూర్తయింది.
అయితే ఎస్ 400 క్షిపణుల కొనుగోలు ఒప్పందాన్ని అగ్రరాజ్యం అమెరికా (America)మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. రష్యాతో ఎలాంటి లావాదేవీలు చేయవద్దంటూ ఒత్తిడి పెంచుతోంది. అయితే ప్రాంతీయ భద్రత, రక్షణ రంగంలో అవసరాల దృష్ట్యా ఎస్ 400 ఒప్పందానికి మినహాయింపు ఇవ్వాలని అమెరికా సెనేటర్లు కూడా అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాశారు. దీనిపై ఏవిధమైన స్పందన వెలువడకుండానే క్షిపణి వ్యవస్థ భారత్‌కు చేరే ప్రక్రియ ప్రారంభమైంది.
Also read: Tamilnadu: చెన్నైకు మరోసారి ముప్పు, రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe