Corona Cases In India: దేశంలో కరోనా కేసులు (Covid cases in India) స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో.. 10,853 మందికి వైరస్ సోకినట్లు తేలింది. వైరస్ తో 526 మంది ప్రాణాలు(Covid Deaths) కోల్పోయారని ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ
గత ఏడాది ప్రారంభంలో దేశంలో మొదటి కరోనా కేసు (First Covid Case) నమోదైంది. అప్పటి నుంచి 3.43 కోట్ల మందికి పైగా వైరస్ బారినపడ్డారు. వారిలో 3.37 కోట్ల మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. నిన్న 12,432 మంది వైరస్ ను జయించారు. అయితే కొత్త కేసుల కంటే కోలుకున్నవారే ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం 1,44,845 మంది వైరస్ (Coronavirus)తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.42 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు (Recovery Rate) 98.3 శాతంగా కొనసాగుతోంది. ఇక ఇప్పటి వరకూ 460,787 మరణాలు సంభవించాయి.
టీకాల పంపిణీ..
దేశంలో కొవిడ్ టీకా పంపిణీ (Vaccination in India) జోరుగా కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 28,40,174 డోసుల వ్యాక్సిన్ అందించారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,08,21,66,365 కు చేరింది.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల్లో (coronavirus worldwide) పెరుగుదల నమోదైంది. కొత్తగా 4,17,576 మందికి కొవిడ్ (Corona update) సోకింది. కరోనా ధాటికి 6,350 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25,02,56,255కు చేరింది. మొత్తం మరణాలు 50,59,832కి చేరాయి.
Also Read: Pfizer antiviral pill: కరోనాతో మరణం ముప్పును 89 శాతం తగ్గిస్తున్న ఫైజర్ ఔషధం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook