Corona Vaccine: ఆగస్టు 15న భారత్‌లో కరోనా వ్యాక్సిన్!

భారతదేశంలో (coronavirus) కరోనా విలయతాండవం చేస్తున్న క్రమంలో ఉపశమనం కలిగించే వార్త బయటకు వచ్చింది. కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ దాదాపుగా విజయం సాధించినట్లు తెలుస్తోంది. దేశంలో తయారవుతున్న కరోనా వైరస్ మొట్టమొదటి వ్యాక్సిన్ (First CoronaVirus Vaccine In India) వచ్చే నెల ఆగస్టు 15 న స్వాతంత్య్ర దినోత్సవం రోజున విడుదల చేసే అవకాశముంది. 

Last Updated : Jul 3, 2020, 05:54 PM IST
Corona Vaccine: ఆగస్టు 15న భారత్‌లో కరోనా వ్యాక్సిన్!

CoronaVirus Vaccine In India: న్యూ ఢిల్లీ: భారతదేశంలో (coronavirus) కరోనా విలయతాండవం చేస్తున్న క్రమంలో ఉపశమనం కలిగించే వార్త బయటకు వచ్చింది. కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ దాదాపుగా విజయం సాధించినట్లు తెలుస్తోంది. దేశంలో తయారవుతున్న కరోనా వైరస్ మొట్టమొదటి వ్యాక్సిన్(First Corona Vaccine In India) ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున విడుదల చేసే అవకాశముంది. ఇందుకోసం భారతీయ శాస్త్రవేత్తలు తమ సన్నాహాలను ముమ్మరం చేశారు. ఈ మేరకు క్లినికల్ ట్రయల్స్ కూడా వేగవంతంగా జరగనున్నాయి. Also read: PM Modi Visits Leh: లేహ్‌లో ప్రధాని మోదీ ఆకస్మిక పర్యటన

ఆగస్టు 15న లాంచ్ చేసేందుకు సన్నాహాలు..
భారతీయ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) భారత్ బయోటెక్‌ (Bharat Biotech) సంస్థ సంయుక్తంగా తయారుచేసే కొత్త కరోనా వ్యాక్సిన్ సిద్ధమవుతుందని దేశంలోని అన్ని ప్రధాన వైద్య కళాశాలలకు ఐసీఎంఆర్ అధిపతి డాక్టర్ బలరాం భార్గవ లేఖ రాశారు. BBV152 COVID Vaccine పేరుతో  కోవిడ్ వ్యాక్సిన్‌(COVID19 Vaccine)ను ఆగస్టు 15 న మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని వైద్య కళాశాలలు దీని దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు. ఎయిమ్స్ సహా దేశంలోని 13 ఆస్పత్రులు క్లినికల్ ట్రయల్స్ వేగవంతం చేయాలని, తద్వారా ఈ టీకాను నిర్ణీత సమయంలో విడుదల చేసే అవకాశముందని తెలిపారు. 

ట్రయల్స్ వేగవంతం..
అయితే, ఈ టీకా పరీక్షల్లో నిమగ్నమైన వైద్యుల అభిప్రాయం ప్రకారం.. మానవులపై పరీక్షలు ప్రారంభం కావడానికి కనీసం ఒక వారం సమయం పట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ట్రయల్ పూర్తి కావడానికి 6 నెలల సమయం పడుతుంది. పరీక్షలు పూర్తిచేసి టీకాను ఆగస్టు 15నాటికి విడుదల చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. అయితే టీకా మార్కెట్లోకి రావడానికి  కనీసం మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టనుంది.
Also read: ఇకపై వారికి హోమ్ క్వారంటైన్ ఉండదు

భారత్ బయోటిక్ సంస్థతోనే..
కరోనా టీకా తయారీలో ప్రపంచంలోని కొన్ని దేశాలు ప్రారంభదశలో విజయాన్ని సాధించాయి. వీటిలో భారతదేశం కూడా ఒకటి. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్‌ కంపెనీ కోవాక్సిన్ పరీక్షలు తుది దశకు చేరుకోవడంతో అన్నీ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. అయితే.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ఈ టీకా తయారీలో ముఖ్యమైన పాత్ర పోషించి విజయవంతం దిశగా తీసుకెళ్లాయని భారత్ బయోటెక్ ప్రకటించింది. 
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    

Trending News