India Corona Update: దేశంలో 2 వేల లోపే కొత్త కరోనా కేసులు- మరణాలు ఎన్నంటే..

India Corona Update: దేశంలో కరోనా మహమ్మారి విజృంభం స్థిరంగా కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా పెరిగినా.. 2 వేల లోపే నమోదు కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొవిడ్ పరిస్థితులు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 23, 2022, 11:07 AM IST
  • దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో స్వల్ప వృద్ధి
  • కొత్తగా 2 వేల లోపే కొవిడ్​ బాధితులు
  • మహమ్మారికి మరో 62 మంది బలి
India Corona Update: దేశంలో 2 వేల లోపే కొత్త కరోనా కేసులు- మరణాలు ఎన్నంటే..

India Corona Update: దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ కొత్త కేసుల సంఖ్య రెండు వేలలోపే నమోదవడం గమనార్హం. మంగళవారం ఉదయం నుంచి ఇవాళ (బుధవారం) ఉదయం వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 1,778 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. మొత్తం 6,77,218 టెస్టులకు గానూ ఈ కేసులు నమోదైనట్లు వివరించింది.

ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ కారణంగా 62 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది ఆరోగ్య శాఖ. దేశంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 5,16,605 మంది కొవిడ్​కు బలయ్యారు. దీనితో దేశంలో కొవిడ్​ మరణాల రేటు 1.20 శాతంగా ఉంది.

దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి బుధవారం మధ్య 2,542 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 42,473,057 మంది కరోనా మహమ్మారిని జయించారు.

ఇండియాలో యాక్టివ్ కరోనా కేసులు..

దేశవ్యాప్తంగా ఇంకా 23,087 యాక్టివ్​ కరోనా కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా యాక్టివ్​ కేసుల రేటు 0.05 శాతానికి తగ్గింది. 

దేశంలో వ్యాక్సినేషన్ పంపిణీ ఇలా..

తాజాగా దేశవ్యాప్తంగా 30,53,897 డోసుల కరోనా టీకాలు పంపిణీ చేశారు. వీటితో కలిపి ఇప్పటి వరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,81,89,15,234 వద్దకు చేరింది.

Also read: Assets Seized: ఆ ముగ్గురు ఆర్ధిక నేరగాళ్ల ఆస్థులు సీజ్, వెల్లడించిన కేంద్రమంత్రి

Also read: No Tollgate: నిన్న ఫాస్టాగ్..రేపు జీపీఎస్..జాతీయ రహదారులపై ఇక నో టోల్‌గేట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News