Heavy Rains: అక్టోబర్ నెల వచ్చేసింది. ఇంకా వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలకు కారణమౌతున్నాయి. రానున్న 48 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ సూచించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఓ వైపు, ఉపరితల ఆవర్తనం మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న 3 రోజులు భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు సైతం పడవచ్చని తెలుస్తోంది. అక్టోబర్ 3 వరకూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అంచనా. ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశమున్నందున బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు.
జగిత్యాల, రామగుండం, నిజామాబాద్, వంరగల్ ప్రాంతాల్లోనూ, ఉత్తర తెలంగాణలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడితే భారీ వర్షాలు పడవచ్చు. అల్పపీడనం కారణంగా గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న 3 రోజుల్లో ఏపీలో పార్వతీపురం మన్యం, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు. రాయలసీమలో మాత్రం సాధారణ వర్షపాతం పడవచ్చని తెలుస్తోంది.
దేశంలో నైరుతి రుతు పవనాల ప్రభావం దాదాపుగా ముగిసింది. ఇక ఇప్పుడు అడపాదడపా కురిసే వర్షాలన్నీ బంగాళాఖాతంలో ఏర్పడే వాతావరణ పరిస్థితుల కారణంగా ఉంటాయి. నైరుతి రుతు పవనాలతో ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదైంది. 94.4 శాతం వర్షపాతం నమోదైందని సమాచారం. ఈశాన్య భారతదేశంలో వర్షపాతం లోటు కన్పించింది. దక్షిణ భారతదేశంలో కూడా వర్షపాతం లోటే ఉంది. ఉత్తరాదిన మాత్రం ఈసారి సమృద్ధిగా వర్షం కురిసింది.
Also read: Aditya L1 Mission: ఆదిత్య ఎల్ 1 మిషన్‌లో కీలక మైలురాయి, విజయవంతంగా దాటిన భూ గురుత్వాకర్షణ పరిధి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook