Cow urine రోజూ సేవిస్తా.. అందుకే నాకు Corona రాలేదు: BJP MP Pragya Thakur

Cow urine will check Coronavirus: BJP MP Pragya Thakur | భోపాల్: బీజేపీ ఎంపీ ప్రగ్యా థాకూర్.. ప్రస్తుత రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. 2019 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రగ్యా థాకూర్ చేసిన పలు వ్యాఖ్యలు ఆమెకు విపరీతమైన ప్రచారం తెచ్చిపెట్టాయి. తాజాగా ఆమె మరోసారి వార్తల్లోకెక్కారు. గోమూత్రం కరోనావైరస్‌కు చెక్ పెడుతుందంటూ తాజాగా ప్రగ్యా థాకూర్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Last Updated : May 17, 2021, 09:01 PM IST
Cow urine రోజూ సేవిస్తా.. అందుకే నాకు Corona రాలేదు: BJP MP Pragya Thakur

Cow urine will check Coronavirus: BJP MP Pragya Thakur | భోపాల్: బీజేపీ ఎంపీ ప్రగ్యా థాకూర్.. ప్రస్తుత రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. 2019 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రగ్యా థాకూర్ చేసిన పలు వ్యాఖ్యలు ఆమెకు విపరీతమైన ప్రచారం తెచ్చిపెట్టాయి. తాజాగా ఆమె మరోసారి వార్తల్లోకెక్కారు. గోమూత్రం కరోనావైరస్‌కు చెక్ పెడుతుందంటూ తాజాగా ప్రగ్యా థాకూర్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. '' తాను క్రమం తప్పకుండా ప్రతీ రోజు గో మూత్రం సేవిస్తానని (Drinking cow urine), అందుకే తనకు ఇంకా కరోనా సోకలేదు '' అని బీజేపీ ఎంపీ ప్రగ్యా థాకూర్ అభిప్రాయపడ్డారు.

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్య వహిస్తున్న బీజేపీ ఎంపీ ప్రగ్యా థాకూర్ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి ఆమె పేరు వార్తల్లోకెక్కేలా చేశాయి. తాను నిత్యం దేశీ ఆవుల మూత్రం తాగుతానని, ఆ గో మూత్రమే తనను కరోనావైరస్ నుంచి తనను కాపాడుతోందని చెప్పిన ప్రగ్యా థాకూర్.. ప్రజలను కూడా దేశీ గో మూత్రం సేవించాల్సిందిగా సూచించారు. 

Also read : WhatsApp privacy policy: వాట్సాప్ ప్రైవసీ పాలసీకి నో చెబితే వాట్సాప్ ఎకౌంట్స్ డిలీట్

దేశీ గోమూత్రం సేవించడం వల్ల ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్ బారిన పడవు అని ప్రగ్యా థాకూర్ చెప్పుకొచ్చారు. భోపాల్‌లో జరిగిన పార్టీ సమావేశంలో సభకు హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రగ్యా థాకూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ప్రగ్యా థాకూర్ (Pragya Thakur) చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. '' దేశీ ఆవు మూత్రం (Desi cow urine) తాగితే ఏ అనారోగ్యం దరిచేరదని, తాను ఏ మెడిసిన్ (Medicine) వాడనని, తన అనారోగ్య సమస్యలకు గో మూత్రమే చక్కటి ఔషధంగా పనిచేస్తుంది'' అని ప్రగ్యా థాకూర్ చేసిన వ్యాఖ్యలను పలువురు నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు.

Also read : Covishield 2nd Dose booking: కొవిషీల్డ్ 2వ డోస్ బుక్ చేసుకుంటున్నారా ?ఈ విషయం తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News