Himachal Pradesh Election Results 2022: హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బోణీ.. సీఎం జైరాం ఠాకూర్‌ భారీ విజయం!

BJP CM Jairam Thakur wins from Seraj against Congress Chet Ram. హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముందుగా బీజేపీ బోణి కొట్టింది. సెరాజ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం జైరాం ఠాకూర్‌ భారీ విజయం సాధించారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 8, 2022, 12:05 PM IST
  • హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బోణీ
  • సీఎం జైరాం ఠాకూర్‌ భారీ విజయం
  • ఇప్పటికే బీజేపీ 4 చోట్ల గెలుపొంది
Himachal Pradesh Election Results 2022: హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బోణీ.. సీఎం జైరాం ఠాకూర్‌ భారీ విజయం!

BJP CM Jai Ram Thakur wins from Seraj by 20000 votes against Congress leader Chet Ram: గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం నుంచి కొనసాగుతోన్న విషయం తెలిసిందే. గుజరాత్‌లో  భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోటీ ఉంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇప్పటికే బీజేపీ 4 చోట్ల గెలుపొంది.. 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు కాంగ్రెస్‌ 35 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 

హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముందుగా బీజేపీ బోణి కొట్టింది. సెరాజ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం జైరాం ఠాకూర్‌ భారీ విజయం సాధించారు. జైరాం ఠాకూర్ కాంగ్రెస్ నేత చేత్ రామ్‌పై గెలుపొందారు. సీఎం జైరామ్ ఠాకూర్ 20 వేలకు పైగా ఆధిక్యంతో 6వ సారి విజయం సాధించారు. మరోవైపు సుందేర్‌నగర్‌ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి రాకేశ్‌ కుమార్‌ విజయం సాధించారు. హిమాచల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 35 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంటుంది. 

1985 నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌లో 5 సంవత్సరాల పదవీకాలం తర్వాత ప్రభుత్వం మారుతుందనే సంప్రదాయం ఉంది. అయితే ఆ సంప్రదాయం ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. హిమాచల్‌లో బీజేపీ అధికారాన్ని నిలుపుకోగలదా లేదా కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే హిమాచల్‌ ప్రదేశ్‌లో మెజారిటీ ఎగ్జిట్ పోల్‌లు బీజేపీ గెలుస్తుందని ఇప్పటికే పేర్కొన్నాయి. ప్రస్తుత హవా చూస్తే అదే నిజమయ్యేలా ఉన్నాయి. చూడాలి మరి ఎవరు గెలుస్తారో. 

మరోవైపు గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ హవా కొనసాగుతోంది. మొత్తం 182 స్థానాలకు గానూ ఇప్పటివరకు బీజేపీ 13 స్థానాల్లో విజయం సాధించింది. మరో 142 చోట్ల అధికారిక బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఒక చోట విజయం సాధించి.. 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్‌ 8, ఇతర పార్టీలు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ప్రస్తుత రిజల్ట్స్ ప్రకారం బీజేపీ మరోసారి గుజరాత్‌లో పీఠం ఎక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

Also Read: Rohit Sharma Record: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. శ్రేయాస్, మెహదీ రేర్ రికార్డ్స్ ఇవే!  

Also Read: Mohammed Siraj: మహ్మద్‌ సిరాజ్‌ అరుదైన రికార్డు.. అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా రికార్డుల్లోకి!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.

Trending News