Rains Alert: తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. గతకొంతకాలంగా ముసురు పట్టుకుంది. రుతు పవనాలు, అల్పపీడనం, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో విస్తారంగా కురుస్తున్నాయి. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయి. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. నల్గొండ జిల్లాలో ఓ ఇళ్లూ కూలిన ఘటనలో తల్లీకూతుళ్లు మృతి చెందారు.
హైదరాబాద్‌లోనూ ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, అమీర్‌పేట్, నాంపల్లి, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంటల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్, పెద్ద అంబర్‌పేట, తుర్కయంజాల్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో వర్షం పడింది. తెలంగాణలో రాగల మూడురోజులపాటు వాతావరణం ఇలాగే ఉండనుంది.
దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకుని ఉన్న వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది ఉంది. ఇటు రుతు పవన ద్రోణి..జైసాల్మర్, కోట, జబల్‌పూర్, పెండ్రారోడ్, కళింగపట్నం మీదుగా నైరుతి అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వ్యాపించింది. వీటికి రుతుపవనాలు సైతం తోడు అయ్యాయి.
వీటి ప్రభావంతో రాగల మూడురోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంచిర్యాల, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఇదే వాతావరణం ఉండనుంది.
ఇటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. మరో మూడురోజులపాటు వర్షాలు పడనున్నాయి అమరావతి, విశాఖ వాతావరణ కేంద్రాలు ప్రకటించాయి. మరోవైపు దేశవ్యాప్తంగా రుతు పవనాలు విస్తరించాయి. వీటి ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Also read: Bhuvneshwar Inswinger: వాట్ ఏ బౌలింగ్ భువనేశ్వర్.. అద్భుత ఇన్‌స్వింగర్‌కు బిత్తరపోయిన బట్లర్!
Also read: YS Vijayamma: వైసీపీకి వైఎస్ విజయమ్మ రాజీనామా.. కుటుంబ కలహాలే కారణమా..?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook