Covaxin: కోవ్యాక్సిన్ వాలంటీర్‌గా హర్యానా మంత్రి అనిల్ విజ్

ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ (Bharat Biotech) అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌-19 వ్యాక్సిన్ ‘కోవ్యాక్సిన్’ తుది దశ క్లినికల్ ట్రయల్స్‌ దేశ్యావ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగాల్లో వాలంటీర్‌గా హర్యానా (Haryana) ఆరోగ్య మంత్రి భాగస్వామ్యం కానున్నారు.

Last Updated : Nov 19, 2020, 08:51 AM IST
Covaxin: కోవ్యాక్సిన్ వాలంటీర్‌గా హర్యానా మంత్రి అనిల్ విజ్

Haryana - ‘Covaxin’ 3rd Phase trials: న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ (Bharat Biotech) అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌-19 వ్యాక్సిన్ ‘కోవ్యాక్సిన్’ తుది దశ క్లినికల్ ట్రయల్స్‌ దేశ్యావ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగాల్లో వాలంటీర్‌గా హర్యానా (Haryana) ఆరోగ్య మంత్రి భాగస్వామ్యం కానున్నారు. ఈ మేరకు హర్యానా హోంమంత్రి, ఆరోగ్యమంత్రి అయిన అనిల్ విజ్ (Anil Vij ) స్వయంగా ట్విట్ చేసి బుధవారం వెల్లడించారు. నవంబరు 20 నుంచి రాష్ట్రంలో ప్రారంభం కానున్న భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలకు.. తొలి వాలంటీర్‌గా తాను స్వచ్ఛందంగా ముందుకొచ్చినట్లు మంత్రి అనిల్ విజ్ ట్విట్టర్‌లో ప్రకటించారు. Also read: Covid-19: ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు

నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (NIV), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR‌) సహకారంతో భారత్ బయోటెక్.. కోవ్యాక్సిన్‌ ( Covaxin ) ను అభివృద్ధి చేస్తోంది. అయితే మొదటి, రెండో దశ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ ద్వారా ఉత్తమ ఫలితాలు రావడంతో.. డ్రగ్ కంట్రోల్‌ జనరల్ ఆఫ్‌ ఇండియా (DGCI) అనుమతితో ఈ నెల 16 నుంచి కోవ్యాక్సిన్ మూడోదశ ప్రయోగాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ కోవాక్సిన్ ట్రయల్స్‌ను దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో.. 26వేల మంది వాలంటీర్లపై నిర్వహించనున్నారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం ఇదే మొదటిసారి. అయితే ఈ కోవ్యాక్సిన్ వచ్చే ఏడాది ప్రారంభం నాటికి అందుబాటులోకి రానుంది. Also read: Mumbai Police: కంగనా, రంగోలీలకు మూడోసారి నోటీసులు

 

Also read : How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Trending News