Harbhajan Singh: మై ఫ్రెండ్ అంటూ భగవంత్ మాన్​కు భజ్జీ శుభాకాంక్షలు

Harbhajan Singh: పంజాబ్​ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్​ పార్టీకి హర్బజన్​ సింగ్ శుభాకాంక్షలు చెప్పారు. కాబోయే సీఎం భగత్​ సింగ్ మాన్​కు మై ఫ్రెండ్ అంటూ శుభాకాంక్షలతో ట్వీట్ చేశారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 11, 2022, 07:16 PM IST
  • పంజాబ్​లో కొలువుదీరనున్న ఆఫ్​ ప్రభుత్వానికి హర్బజన్​ విషెస్​
  • కాబోయే సీఎంకు మై ఫ్రెండ్ అంటూ ఆప్యాయంగా శుభాకాంక్షలు
  • ట్విట్టర్​లో భగవంత్​ మాన్​, ఆయన తల్లితో ఉన్న ఫొటో షేర్ చేసిన భజ్జీ
Harbhajan Singh: మై ఫ్రెండ్ అంటూ భగవంత్ మాన్​కు భజ్జీ శుభాకాంక్షలు

Harbhajan Singh: పంజాబ్​లో ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్​) సాధించిన రికార్డు విక్టరీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖ నేతలతో పాటు.. సెలబ్రెటీలు కాబోయే సీఎం భగవంత్ మాన్​కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

తాజాగా భారత స్టార్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ భగవంత్ మాన్​కు శుభాకాంక్షలు చెప్పారు. గెలుపు సంబరాల్లో భగవంత్ మాన్ తన తల్లితో ఉన్న ఫోటోను ట్విట్టర్​లో పోస్ట్ చేశారు భజ్జీ. ఏ తల్లికైనా ఇది గర్వంగా తలెత్తుకొనే విషయమన్నారు.

భగవంత్ మాన్​ను మై ఫ్రెండ్ అంటూ సంబోధించిన హర్బజన్... సీఎం పీఠంపై కూర్చోబోతున్నందుకు శుభాకాంక్షలు చెప్పారు. అంతేకాకుండా భగత్ సింగ్ స్వగ్రామం కట్కర్కలాన్​లో ప్రమాణస్వీకారం చేయడం ఎంతో ఆనందం కల్గిస్తోందన్నారు.

పంజాబ్​ను ఊడ్చేసిన ఆప్​..

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 92 సీట్లలో ఘనవిజయం సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ పార్టీ నుంచి భగవంత్ మాన్ సీఎం కాబోతున్నారు. ఈ నెల 16 న ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ  కార్యక్రమానికి ఆప్ చీఫ్‌ అరవింద్ కేజ్రివాల్​తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది. భగత్​సింగ్ స్వగ్రామంలో భగవంత్​ మాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు.

Also read: FACT CHECK: పీఎం శ్రమయోగి మాన్‌ధన్‌ యోజన పథకంపై తప్పుడు ప్రచారం.. జీ తెలుగు ఫ్యాక్ట్‌ చెక్‌

Also read: Uttrakhand Next CM: ఓడిన పుష్కర్ సింగ్ ధామీ.. ఉత్తరాఖండ్‌కి కాబోయే సీఎం ఎవరు..??

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook , Twitter

Trending News