PM Modi: నేడు (ఫిబ్రవరి 16) సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా.. ఢిల్లీలోని కరోల్ బాగ్ లో ఉన్న గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి.. అనంతరం శబ్ద్ కీర్తన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత అక్కడున్న భక్తులతో కొద్దిసేపు ముచ్చటించారు.
సంత్ రవిదాస్ సంఘ సంస్కర్త
సంత్ రవిదాస్ 16వ శతాబ్దంలో ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో జన్మించారు. ఆయన సంఘ సంస్కర్త. అంటరానితనాన్ని వ్యతిరేకించాడు. సమాజం కోసం పనిచేస్తూ తన వృత్తిని వదిలిపెట్టలేదు. మీరు చేసే పనిని ఎప్పటికీ వదులుకోవద్దని ఆయన ఎప్పుడూ బోధిస్తూ ఉంటారు. సంత్ రవిదాస్ 'మన్ చాగాతో కథోటి మే గంగా' అనే సందేశాన్ని ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహా పంజాబ్ లోనూ సంత్ రవిదాస్ అనుచరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా పంజాబ్ లో విశేషమైన భక్తుల ఆదరణ ఉంది. ఆయన్ని.. రవిదాస్ లేదా రైదాస్ అని భక్తులు పిలుస్తుంటారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంత్ రవిదాస్ ఆలయాన్ని సందర్శించారని ప్రతిప్రక్షాలు ఆరోపిస్తున్నాయి.
పంజాబ్ ఎన్నికలు
ఫిబ్రవరి 14న పంజాబ్ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల సంఘం ఆ తేదీని పొడిగిస్తూ ఇటీవలే ఓ ప్రకటన చేసింది. ఫిబ్రవరి 20న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సంత్ రవిదాస్ జయంతి కారణంగా అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి సమర్పించిన లేఖ ఆధారంగా ఈ వాయిదా జరిగిందని వార్తలు వస్తున్నాయి.
Also Read: Shivraj Singh Chouhan: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు రెండోసారి కరోనా
Also Read: Sansad TV: 'సంసద్ టీవీ' యూట్యూబ్ ఛానెల్ హ్యాక్... అకౌంట్ నిలిపివేత !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook