COVID Restrictions: మార్చి 31 తర్వాత కొవిడ్ ఆంక్షలన్నీ ఎత్తివేత- కానీ..

COVID Restrictions: కరోనా కఠిన నిబంధనలకు స్వస్తి చెప్పందుకు కేంద్రం సిద్ధమైంది. దేశంలో కొవిడ్ పరిస్థితులు మెరుగవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 31 తర్వాత కఠిన నిబంధనలను సడలించనున్నట్లు వివరించింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 23, 2022, 04:30 PM IST
  • మార్చి 31 తర్వాత కఠిన కొవిడ్ నిబంధనలకు గుడ్​బై
  • కేసుల తగ్గుముఖంతో కేంద్రం కీలక నిర్ణయం
  • అధికారికంగా ప్రకటించిన కేంద్రం!
COVID Restrictions: మార్చి 31 తర్వాత కొవిడ్ ఆంక్షలన్నీ ఎత్తివేత- కానీ..

COVID Restrictions: గత రెండేళ్లకుపైగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ప్రభావం​ ఇటీవల కాస్త తగ్గుతూ వస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య రెండు వేల లోపే నమోదవుతూ వస్తోంది. మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గుముఖం పట్టింది. కొవిడ్ పరిస్థితులుకాస్త మెరుగవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

కొవిడ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నెలాఖరు తర్వాత (మార్చి 31) తర్వాత కొవిడ్ కఠిన నిబంధనలన్నీంటిని సడలించనున్నట్లు తెలిపింది. అయినప్పటికీ.. ఫేస్​ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు మాత్రం కొనసాగుతాయని వెల్లడించింది.

గత ఏడాది నుంచి నిబంధనలు..

కరోనా వైరస్​ విజృంభణ నేపథ్యంలో.. డిజాస్టర్ మేనేజ్​మెంట్ యాక్ట్​ (డీఎం) 2005ను అనుసరించి.. 2020 మార్చి 24 నుంచి కఠిన కొవిడ్ నిబంధనలు అమలులోకి తెచ్చింది కేంద్రం. ఆ తర్వాత కొవిడ్​ పరిస్థితులను బట్టి నిబంధనల్లో మార్పులు చేస్తూ వచ్చింది. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుమgఖంపట్టిన కారణంగా.. కొవిడ్​ ఆంక్షలన్నీ ఎత్తవేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే జనసందోహం ఉన్న ప్రాంతాల్లో, బహిరంగ ప్రాంతాల్లో మాస్క్​ ధరించడం వంటి నిబంధనలు కొనసాగుతాయని వివరించింది కేంద్రం.

ఇంతకు మందే పౌర విమానయాన శాఖ (డీజీసీఏ).. విమానాల్లో సిబ్బంది పీపీఈ కిట్ ధరించడం నుంచి మినహాయింపునిచ్చింది. ఇప్పడు తాజాగా కఠిన కొవిడ్ నిబంధనలన్నింటి నుంచి మినహాయింపు ఇవ్వడం గమనార్హం.

Also read: Uttar Pradesh: యూపీలో విషాదం.. టాఫీలు తిని నలుగురు చిన్నారులు మృతి..

Also read: India Corona Update: దేశంలో 2 వేల లోపే కొత్త కరోనా కేసులు- మరణాలు ఎన్నంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News