Attorney General: సోషల్ మీడియాపై ఆంక్షలు మంచిది కాదు

Attorney Ge eral: సోషల్ మీడియాపై భారత అటార్నీజనరల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాపై ఆంక్షలనేవి ప్రభుత్వాలకు చట్టపరమైన ఇబ్బందులు తెస్తాయని అభిప్రాయపడ్డారు.  ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదన్నారు.

Last Updated : Dec 8, 2020, 09:20 AM IST
  • సోషల్ మీడియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన భారత అటార్నీ జనరల్
  • సోషల్ మీడియాపై ఆంక్షలనేవి ప్రభుత్వాలకు మంచిది కాదు
  • అతి తక్కువ కేసుల్లోనే కోర్టు ధిక్కరణ కేసులు చేపడుతుంది కోర్టు
Attorney General: సోషల్ మీడియాపై ఆంక్షలు మంచిది కాదు

Attorney General: సోషల్ మీడియాపై భారత అటార్నీజనరల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాపై ఆంక్షలనేవి ప్రభుత్వాలకు చట్టపరమైన ఇబ్బందులు తెస్తాయని అభిప్రాయపడ్డారు.  ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదన్నారు.

సోషల్ మీడియా ( Social media ) విషయంలో అటార్నీ జనరల్ కే కే వేణుగోపాల్ ( Attorney general kk venugopal ) చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. సోషల్ మీడియా విషయంలో అతి తక్కువ కేసుల్లోనే సుప్రీంకోర్టు కోర్టు ( Supreme court ) ధిక్కరణ  చర్యలు చేపడుతుందని వేణుగోపాల్ గుర్తు చేశారు. సోషల్ మీడియాలో బహిరంగ చర్చలు జరగడం ప్రజాస్వామ్యానికి మంచిదేనన్నారు. మరీ హద్దు మీరితేనే కోర్టు స్పందిస్తుందన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరించే చర్యలు తీసుకోవడం ఏ ప్రభుత్వానికీ..ఏ వ్యవస్థకూ మంచిది కాదన్నారు. స్వేచ్ఛతో కూడిన ప్రజాస్వామ్యం, బహిరంగ చర్చలు ఎప్పుడూ అవసరమేనని తెలిపారు అటార్నీ జనరల్. 

సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకుని ట్వీట్లు చేస్తున్నవారిపై కోర్టు ధిక్కరణ  చర్యలు ప్రారంభించేలా అనుమతివ్వాలంటూ విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. అయితే ఈ తరహా విజ్ఞప్తులు త్వరలో అగిపోతాయని వేణుగోపాల్ ఆశించారు. కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలంటే.. అటార్నీ జనరల్‌ లేదా సొలిసిటర్‌ జనరల్‌ అంగీకారం తెలిపాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కోర్టు ధిక్కరణ ( Contempt of court ) అంశంపై ఆయన మాట్లాడారు.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ( Central Vista project ) కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల పదోతేదీన పునాదిరాయి వేయవచ్చని చెప్పింది. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీలో నూతన పార్లమెంట్‌ భవన సముదాయం, కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ భవన నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం ( Central Government ) తలపెట్టింది. పర్యావరణానికి విఘాతం కలిగించే ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్ పై కోర్టు విచారణ జరుపుతోంది. తుది నిర్ణయం వెలువడేవరకూ ఎలాంటి నిర్మాణాలు గానీ, కూల్చివేతలు గానీ చేయమని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో శంకుస్థాపనకు ఓకే చెప్పింది సుప్రీంకోర్టు. 

మీడియాపై భారత అటార్నీజనరల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాపై ఆంక్షలనేవి ప్రభుత్వాలకు చట్టపరమైన ఇబ్బందులు తెస్తాయని అభిప్రాయపడ్డారు.  ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదన్నారు. Also read: AP High court: జ్యుడీషియల్ రివ్యూకు..ప్రివ్యూకు తేడా తెలుసుకోకపోతే ఎలా

Trending News