Punjab CM Bhagwant Mann: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది పంజాబ్ సర్కార్. వేసవి దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను మార్చుతూ భగవంత్ మాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగులు ఉదయం 7.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తే చాలని ప్రభుత్వం తెలిపింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇంటికి వెళ్లిపోవచ్చని స్పష్టం చేసింది.
విద్యుత్ డిమాండ్ ను తగ్గించడం, పని సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. మే 2 నుండి జూలై 15 వరకు ఈ సమయ వేళలు కొనసాగుతాయి. ఇలాంటి విధానాన్ని దేశంలో ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి అని మాన్ తెలిపారు. ఇలా చేయడం వల్ల ఎండాకాలంలో 300 నుండి 350 మెగావాట్ల వరకు విద్యుత్తును ఆదా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఉద్యోగులు తమ కుటుంబాలతో గడపడానికి తగినంత సమయం ఉంటుంది. ఈ విధానాన్ని అమలు చేయడం వల్ల ప్రజలకు సేవలు సకాలంలో అందుతాయని ఆయన అన్నారు. విదేశాల్లో విద్యుత్తును ఆదా చేయడానికి ప్రతి ఆరు నెలలకు ఒక గంట చొప్పున తమ సమయాన్ని మార్చుకుంటున్నారని మాన్ తెలిపారు.
పంజాబ్ లో విద్యుత్ వినియోగం మధ్యాహ్నం 2 నుంచి 5 మధ్యే ఎక్కువగా ఉంటోందని ఆ స్టేట్ విద్యుత్ బోర్డు సీఎంకి వివరించిన నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంజాబ్ రైతులను ఆదుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్ కు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా లేఖ రాశారు.
Also Read: Droupadi Murmu: తొలిసారి సుఖోయ్ విమానంలో విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి