Cooking Oil: దేశంలో దిగొస్తున్న వంట నూనెల ధరలు..తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు..!

Cooking Oil: వంట రూమ్‌ల్లో భగ భగమండిన ఆయిల్ ధరలు క్రమేపి దిగి వస్తున్నాయి. గత నెల వంట నూనెల ధరలు రూ.10 మేర తగ్గాయి. తాజాగా సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.

Written by - Alla Swamy | Last Updated : Jul 7, 2022, 12:42 PM IST
  • దిగి వస్తున్న వంట నూనెల ధరలు
  • తాజాగా కేంద్రం మరో నిర్ణయం
  • కంపెనీలకు కీలక ఆదేశాలు
Cooking Oil: దేశంలో దిగొస్తున్న వంట నూనెల ధరలు..తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు..!

Cooking Oil: దేశంలో నిత్యావసర ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో వంట నూనెల ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. దిగుమతి చేసుకున్న వంట నూనెల ధరలను వారం రోజుల్లోగా లీటర్‌కు రూ.10 వరకు తగ్గించాలని సదరు కంపెనీలను ఆదేశించింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గాయని..దేశీయంగా ఎంఆర్‌పీని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా ఒక బ్రాండ్ నూనెకు ఒకే ఎంఆర్‌పీని పాటించాలని తేల్చి చెప్పింది. గతకొంతకాలంగా అంతర్జాతీయ పరిణామాలతో దేశంలో వంట నూనెలు సలసల కాగాయి. నిత్యావసర ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా వంటనూనెల ధరలు తగ్గుతున్నాయి. దీంతో దేశంలోనూ తగ్గించాలని కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత నెలలో నూనె ధరను లీటర్‌కు రూ.10 నుంచి రూ.15 వరకు కంపెనీ తగ్గించాయి. 

దీంతో బహిరంగ మార్కెట్‌లో వంట నూనెల ధరలు దిగి వస్తున్నాయి. గతంలో రూ.180 ఉన్న ఆయిల్‌..ఇప్పుడు రూ.150-160 దొరుకుతోంది. రాబోయే రోజుల్లో మరింత తగ్గుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా పరిణామాలు మెరుగుపడుతున్నాయని..వంట నూనెలతోపాటు చమురు ధరలు సైతం తగ్గనున్నాయని చెబుతున్నారు. 

Also read:YSRCP Plenary-2022: ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరీకి వేళాయే..రెండురోజుల సమావేశాల్లో ఎజెండా ఇదే..!

Also read:TS Inter Exams-2022: తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News