బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర మరింత తగ్గింది. బంగారం ధరల్లో గురువారం స్వల్పమైన తగ్గుదల కనిపించగా.. ఆ ట్రెండ్‌ని కొనసాగిస్తూ ఇవాళ కూడా మరో రూ.200 తగ్గుదల చోటుచేసుకుంది. దీంతో పది గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,350కి స్థాయిని చేరుకోగా, వెండి ధర రూ.75 పెరిగి కిలోకు రూ.39,050కి మార్కుని అందుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు, డాలర్ విలువలో మార్పుల ప్రభావం ఇందుకు ఓ కారణమైతే, స్థానికంగా ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గడమే మరో కారణమైంది అంటున్నాయి మార్కెట్ వర్గాలు. ఇక వెండి ధరల్లో పెరుగుదలకు కారణం.. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెరగడమేనని మార్కెట్ వర్గాలు స్పష్టంచేశాయి.
వెండి నాణేల కొనుగోలు, అమ్మకం ధరల్లో ఎటువంటి మార్పు లేదు. 100 వెండి నాణేలు కొనుగోలు రూ.74,000 వద్ద వుండగా, 100 వెండి నాణేల అమ్మకం విలువ రూ.75,000 వద్ద కొనసాగుతోంది.