ఓవైపు రూపాయి విలువ బలహీనపడుతోంటే.. మరోవైపు బంగారం ధర అమాంతం పెరుగుతోంది. ఇవాళ ఒక్క రోజే బంగారం ధరలో రూ.500లకు పైగా పెరుగుదల కనిపించడంతో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.32,000 మార్కును దాటింది. హైదరాబాద్లో 10 స్వచ్ఛమైన బంగారం ధర రూ.32,040గా ఉండగా ఢిల్లీలో రూ.32,566, ముంబైలో రూ.32,491, కోల్కతాలో రూ. 32,705 పలుకుతోంది. రూపాయి విలువ క్షీణించడం సైతం బంగారం ధరల పెరుగుదలకు ఓ కారణమైందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలావుంటే, మరోవైపు వెండి ధర కూడా స్వల్ప పెరుగుదల అనంతరం రూ.450ల మార్కుకు చేరింది. మార్కెట్లో వెండి వినియోగం పెరగడమే ధరల పెరుగుదలకు కారణం అయి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.