కరోనా ఎఫెక్ట్: మే 3 వరకు జీతాల్లేవ్

దేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్‌డౌన్ గడువును సైతం మే3వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

Last Updated : Apr 20, 2020, 10:57 AM IST
కరోనా ఎఫెక్ట్: మే 3 వరకు జీతాల్లేవ్

CoronaVirus Updates| కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడింది. దేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్‌డౌన్ గడువును సైతం మే3వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా రైలు, విమాన, బస్సు, ఇతరత్రా పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు సౌకర్యాలను నిలిపివేశారు. వీటి కారణంగా ఉద్యోగాలు కోల్పోవడం, లేక ఏ జీతాలు లేకుండా సెలవులపై వెళ్లాలని ఉద్యోగులను కంపెనీలు ఆదేశిస్తున్నాయి. కరోనా ‘మహా’ విలయం.. 4వేలు దాటిన కేసులు

గో ఎయిర్ విమాన సంస్థ సైతం తమ ఉద్యోగులను సెలవులపై వెళ్లాలని సూచించింది. అయితే ఈ సమయంలో ఎలాంటి వేతనాలు ఉండవని, లీవ్ వితౌట్ పే కింద తమ ఉద్యోగులను సెలవుపై పంపించామని పీటీఐకి ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. శనివారం రోజు తమ ఉద్యోగులు, సిబ్బందికి ఇలా సూచించినట్లు గోఎయిర్ పేర్కొంది. ఏప్రిల్ 15 నుంచి పలు విమాన సంస్థలు తమ సర్వీసులను నిలిపివేయగా.. అనంతరం కేంద్ర ప్రభుత్వం అధికారికంగానే విమాన సర్వీసులను రద్దు చేసింది. PHotos: హెబ్బా.. అందాలు చూస్తే అబ్బా!

5500 ఉద్యోగులకుగానూ అత్యవసర పనుల నిమిత్తం కేవలం 10శాతం ఉద్యోగుల సేవల్ని ప్రస్తుతం వినిగించుకుంటున్నాం. వారికి సైతం పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించలేం. సుదీర్ఘకాలం సర్వీసులు నిలిపివేయడంతో ఆర్థిక సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ఉద్యోగులను చెల్లింపులు లేని సెలవుదినాలపై వెళ్లాలని సూచించాం. Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!
 

మే 4నుంచి సర్వీసులు మళ్లీ ప్రారంభం కావాలని కోరుకుంటున్నట్లు సంస్థ ప్రతినిధి వివరించారు. సరికొత్త వాతావరణంలో నూతన పరిస్థితులకు తగ్గట్లుగా సేవలు పునరుద్ధరించాల్సి వస్తుందన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

Trending News