Third Wave of Corona: ఇండియాలో ఒమిక్రాన్​ ఐదో కేసు- థార్డ్​ వేవ్​ తప్పదా?

Third Wave of Corona In India: దేశంలో కరోనా థార్ట్​ వేవ్​ వచ్చే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒమిక్రాన్ ఐదో కేసు భయటపడిన నేపథ్యంలో ఈ అంచనాలకు మరింత బలం చేకూరుతోందటున్నారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2021, 01:45 PM IST
  • థార్ట్​ వేవ్​ రావచ్చంటున్న నిపుణులు!
  • ఒమిక్రాన్ కేసుల్లో వృద్ధితో భయాలు
  • తాజాగా బయటపడిన ఐదో కేసు
Third Wave of Corona: ఇండియాలో ఒమిక్రాన్​ ఐదో కేసు- థార్డ్​ వేవ్​ తప్పదా?

India should be prepared to fight a possible third wave: కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్ ఆందోళనలు మరింత తీవ్రమవుతున్నయి. తొలుత దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఈ వేరియంట్​ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాపిస్తోంది. ఈ వేరియంట్​పై శాస్త్రవేత్తలు ఇంకా పూర్తి సమాచారం కోసం పరిశోధనలు జరుపుతున్నారు.

తాజాగా భారత్​లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఐదుకు చేరాయి. ఈ నేపథ్యంలో భారత్​లో కరోనా మూడో వేవ్ రావచ్చని అంచనాలు వస్తున్నాయి. విశ్లేషకులు కూడా మూడో వేవ్​ను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధం కావాలని హెచ్చరిస్తున్నారు.

హెచ్చరికలు అందుకేనా?

ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్​ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు పరిశోధకులు. ఈ నేపథ్యంలోనే దేశంలో ఈ రకం కరోనా కేసులు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.

ఒమిక్రాన్ కేసులు ఇలా..

దేశంలో తొలుత కర్ణాటకలో కరోనా కేసులు బయపడ్డాయి. ఆ తర్వాత గుజరాత్​లోని జామ్​నగర్​లో మూడో కేసు వచ్చింది. ఇక నిన్న (శనివారం) ముంబయిలో నాలుగో కేసు.. తాజాగా ఆదివారం ఢిల్లీలో ఐదో కేసు బయపడింది. టాంజానియా నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఒమిక్రాన్​ వేరియంట్ ఉన్నట్లు గుర్తించారు.

ఇదిలా ఉండగా.. ఒడిశా, కేరళ, తమిళనాడు, మిజోరం, జమ్ము కశ్మీర్​లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఈ భయాలు కూడా థార్డ్​ వేవ్​ రావచ్చనే సంకేతాలను ఇస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వార్తా సంస్థ ఏఎన్​ఐతో మాట్లాడిన బీబీ నగర్ ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​ వికాస్ భాటియా.. 30కి పైగా దేశాలు కనీసం ఒక ఒమిక్రాన్​ కేసును ప్రకటించినట్లు తెలిపారు. అయినప్పటికీ ఇంకా పూర్తి సమాచారం కోసం (వేరియంట్​ గురించి) వేచి ఉండాల్సి వస్తోందన్నారు. అందుకే.. మూడో వేవ్​ వస్తుందనే ఉద్దేశంతో సిద్ధంగా ఉండాలన్నారు.

అయితే తాము ఈ వేరియంట్ అంత ప్రమాదకరం కాదని గుర్తిస్తే మాత్రం.. అది శుభవార్త కావచ్చని పేర్కొన్నారు వికాస్​ భాటియా. అయితే ఈ వేరియంట్ వల్ల ఎక్కువగా మరణాలు సంభవించలేదు కాబట్టి.. దీని ప్రభావం తక్కువగా ఉండొచ్చని ప్రస్తుతానికి అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

ఒమిక్రాన్ గురించి ఇప్పటి వరకు ఉన్న సమాచారం..

కరోనా కొత్త కొత్త వేరియంట్లు రావడం ఇప్పటికే చాలా సార్లు చూశాం. అందులో డెల్టా ప్లస్​ వేరియంట్​ ఇప్పటి వరకు ప్రమాదకరంగా గుర్తించారు. అయితే ఒమిక్రాన్​ అంతకన్నా ప్రమాదకరమని తెలుస్తోంది. ఇందుకు కారణం.. డెల్టా ప్లస్​లో రెండు మూడు ఉత్పరివర్తనాలను మాత్రమే గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అదే ఒమిక్రాన్​లో 30కి పైగా మ్యుటేషన్లు ఉన్నట్ గుర్తించారు. దీన్ని బట్టే ఒమిక్రాన్ తీవ్రను అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు.

Also read:Omicron: ఢిల్లీలో ఫస్ట్ ఒమిక్రాన్ కేసు-దేశంలో ఐదుకి చేరిన కొత్త వేరియంట్ కేసులు

Also read: Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రికార్డు- 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News