Independent Candidates Produce These Certificates To Elections Commission: దేశంలో ప్రస్తుతం ఒకవైపు ఎండలు దంచికొడుతున్నాయి. ఇక మరోవైపు ఎన్నికలు కూడా హీట్ ను మరింత పెంచుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పటికే అనేక పార్టీలు, తమ పార్టీ నుంచి ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులను ప్రకటించాయి. కొందరు ఆశావహులు టికెట్ దొరక్క పోవడంతో ఆయా పార్టీల అధిష్టానంకు షాక్ ఇస్తున్నాయి. ఎన్నికల బరిలో ఉండేందుకు టికెట్ ఇవ్వాలని లేకుంటే ఇండిపెండెంట్ లుగా పోటీచేయడానికిసైతం వెనుకాడబోమంటూ హెచ్చరిస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. కొందరు రాజకీయ నాయకులు టికెట్ లు దొరకడం వల్ల సంబరాలు చేసుకుంటుంటే, మరికొందరు మాత్రం తమ పార్టీకి రాజీనామాలు చేసి రెబల్ గా బరిలో ఉంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో.. ఇండిపెండెంట్ లుగా ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులు కొన్ని సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకొవాల్సిన అవసరం ఉంది.
అభ్యర్థులు ముఖ్యంగా..
- నో డ్యూస్ సర్టిఫికెట్ :- మీ గ్రామ పంచాయితీ/మున్సిపాలిటీ నుండి తీసుకోవాలి.
- కేస్ట్ సర్టిఫికెట్ :- రిజర్వుడు స్థానాల్లో పోటీ చేసే వారు తప్పనిసరిగా కొత్త కేస్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలి.
- మిమ్మల్ని బలపరుస్తున్నట్టు మీ నియోజక వర్గంలో 10 మంది ఓటరు కార్డు జిరాక్స్ లు.
- పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ :- మీరు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తారో ఆ స్టేషన్ నుండి పొందవచ్చు.
- మీకు ఉన్న అన్ని బ్యాంకు ఖాతాల ఫస్ట్ పేజీ జిరాక్స్ మరియు 6 నెలల స్టేట్ మెంట్ మరియు పాన్ కార్డ్ జిరాక్స్ ( భార్య/భర్త, పిల్లలు ఉంటే వారివి కూడా)
- స్థిర, చర ఆస్తుల వివరాలు మరియు అప్పుల వివరాలు.
- డిపాజిట్ సొమ్ము ఎంపీ అభ్యర్థికి 25000 / ఎస్సీ ఎస్టీ వారికి 12500.
- ఎమ్మెల్యే అభ్యర్థికి 10000 / ఎస్సీ ఎస్టీ వారికి 5000.
పై విధంగా అన్నిరకాల డ్యాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్, డబ్బులు సిద్ధంగా ఉంచుకుంటే ఇండిపెండెంట్లుగా ఎన్నికల బరిలో ఈజీగా పోటీ చేయవచ్చు.
Read More: King Cobra Blood: కింగ్ కోబ్రా రక్తం తాగడానికి పొటెత్తిన అమ్మాయిలు.. కారణం ఏంటో తెలుసా..?
Read More: Bus Ticket For Parrots: ఇదేం విడ్డూరం.. చిలుకలకు రూ. 444 టికెట్ కొట్టిన కండక్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook