Ganesh Immersion: గణేశ్ నిమజ్జన వేడుకల్లో విషాదం... నీట మునిగి ఏడుగురు మృతి...

Ganesh Immersion Tragedy: గణేశ్ నిమజ్జన వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. నిమజ్జనం సందర్భంగా నీట మునిగి ఏడుగురు మృత్యువాతపడ్డారు.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 10, 2022, 07:26 AM IST
  • హర్యానాలో విషాదం
  • గణేశ్ నిమజ్జన వేడుకల్లో ఏడుగురి మృతి
  • సంతాపం తెలిపిన హర్యానా సీఎం
Ganesh Immersion: గణేశ్ నిమజ్జన వేడుకల్లో విషాదం... నీట మునిగి ఏడుగురు మృతి...

Ganesh Immersion Tragedy: దేశవ్యాప్తంగా గణేశ్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే అక్కడక్కడా కొన్ని అపశృతులు చోటు చేసుకున్నాయి. హర్యానాలో గణేశ్ నిమజ్జనానికి వెళ్లి ఏడుగురు మృత్యువాత పడ్డారు. సోనీపట్‌లో ముగ్గురు, మహేంద్రగఢ్‌లో నలుగురు మృతి చెందారు. మృతులకు సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు.

సోనీపట్‌లోని మిమర్‌పూర్‌ ఘాట్‌ వద్ద గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు నీళ్లలో మునిగిపోయారు. మృతదేహాలను వెలికితీసిన పోలీసులు పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరో ఘటనలో మహేంద్రగఢ్‌లోని ఓ కెనాల్‌లో గణేశ్ నిమజ్జనం చేస్తుండగా.. కెనాల్‌లో వరద ఉధృతికి 9 మంది కొట్టుకుపోయారు. వీరిలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడగలిగారు.

గణేశ్ నిమజ్జన వేడుకల్లో చోటు చేసుకున్న ఈ విషాద ఘటనలు హృదయ విదారకరమని.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

కాగా, గత రెండేళ్లు కోవిడ్ కారణంగా ఆంక్షల నడుమనే గణేశ్ వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఈసారి కోవిడ్ ఆంక్షలేమీ లేకపోవడంతో పెద్ద ఎత్తున వేడుకలు జరిగాయి. దేశవ్యాప్తంగా గ్రామాల నుంచి మెట్రో సిటీల వరకు చిన్నా,పెద్దా అంతా ఆనందోత్సాహాల నడుమ గణేశ్ నిమజ్జన వేడుకలు జరుపుకున్నారు. 

Also Read : Munugode By Election : మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి...

Also Read : Horoscope Today September 10th 2022: నేటి రాశి ఫలాలు... ఈ రాశి వారు ఏ పని చేట్టినా ప్రతికూలత ఎదురవుతుంది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News