న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం అనంతరం ఏర్పడిన కేబినెట్ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తొలిసారిగా సమావేశమైన సంగతి తెలిసిందే.ఈ సమావేశంలోనే కేబినెట్ పార్లమెంట్ సమావేశాల తేదీలపై ఓ నిర్ణయం తీసుకుంది. జూన్ 17నుంచి జులై 26 వరకూ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. జూన్ 19న స్పీకర్ను ఎన్నుకుంటారు. తొలి రెండు రోజులపాటు లోక్ సభకు ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండనుంది.
ఇదిలావుంటే, ఈ సమావేశాల్లోనే జూలై 5వ తేదీన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ గడువు ముగిసిపోనున్న నేపథ్యంలోనే 2019-20 ఆర్థిక సంవత్సరానికి అయ్యే బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది.