FIR on Sundar Pichai: సుందర్ పిచాయ్​కి నిన్న పద్మ పురస్కారం- నేడు కాపీరైట్​ కేసు!

FIR on Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్​ పిచాయ్​పై ముంబయిలో ఎఫ్​ఐఆర్​ నమోదు అయ్యింది. బాలీవుడ్ దర్శకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2022, 10:03 PM IST
  • భారత్​లో సుందర్ పిచాయ్​పై ఎఫ్​ఐఆర్​
  • కాపీ రైట్​ ఉల్లంఘన కింద కేసు నమోదు
  • బాలీవుడ్ డైరెక్టర్​ ఫిర్యాదుతో కేసు
  • ఇటీవలే పిచాయ్​కు పద్మ భూషణ్​ ప్రకటించిన కేంద్రం
FIR on Sundar Pichai: సుందర్ పిచాయ్​కి నిన్న పద్మ పురస్కారం- నేడు కాపీరైట్​ కేసు!

FIR on Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్​పై భారత్​లో కేసు నమోదైంది. కాపీరైట్ చట్టం ఉల్లంఘన కింద ముంబయిలో ఈ కేసు నమోదు చేశారు (Copyright case Sundar pichai, ) పోలీసులు. సుందర్ పిచాయ్​తో పాటు కంపెనీకి చెందిన మరో ఐదుగురిపైనా ఇదే కారణంతో కేసు నమోదైంది.

ఇంతకి అసలు విషయం ఏమిటంటే..

బాలీవుడ్​ డైరెక్టర్​ సునీల్ దర్శన్​.. తాను తీసిన 'ఏక్ హసీనా తి ఏక్ దివానా థా'​ సినిమాను (Ek Haseena Thi Ek Deewana Tha) గుర్తు తెలియని వ్యక్తులు యూట్యూబ్​లో అప్లోడ్ చేసేందుకు అనుమతి నిచ్చినందుకు.. ఈ విషయంపై కాపీరైట్ చట్టాల ఉల్లంఘన కారణంతో ముంబయి కోర్టును ఆశ్రయించారు. సునీల్ దర్శన్ (Film director Suneel Darshan) పిటిషన్​పై సానుకూలంగా స్పందించిన కోర్టు గూగుల్ సీఈఓ సుందర్​ పించాయ్​ సహా ఆ సంస్థకు చెందిన ఐదుగురు అధికారులపై ఎఫ్​ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

కోర్టు ఆదేశాలతో ఈస్ట్ అధేరీలోని ఎంఐడీసీ పోలీస్ స్టేషన్​లో ఎఫ్​ఐఆర్ నమోదైంది. కాపీరైట్ చట్టం 1957లోని సెక్షన్​ 51,63, 69 కింద కేసు నమోదు చేశారు. ఈ విషయంపై దర్యాప్తు కూడా ప్రారంభించారు (Case on Google CEO) పోలీసులు.

అయితే కేంద్ర ప్రభుత్వం నిన్న (మంగళవారం) సుందర్ పించాయ్​కు పద్మ భూషణ్ (Padam award to Sundar Pichai)​ ప్రకటించింది. మరుసటి నాడే ఆయనపై కాపీరైట్ ఉల్లంఘన కింద కేసు నమోదవడం గమనార్హం.

'ఆ సినిమాపై పూర్తి హక్కులు నావే'

ఈ విషయంపై ఓ వార్తా సంస్థతో మట్లాడిన సునీల్ దర్శన్​.. తన సినిమా రైట్స్ ఎవ్వరికి విక్రయించలేదని తెలిపారు. ఈ విషయంపై కొన్నాళ్లుగా యూట్యూబ్​తో పోరాటం చేస్తున్నట్లు వివరించారు. అయినా తనకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదని (Suneel Darshan case on Youtube) పేర్కొన్నారు.

'ఏక్ హసీనా తి ఏక్ దివానా థా'​ సినిమాపై పూర్తి హక్కులు తనకే చెందుతాయని. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దానిని అప్లోడ్ చేస్తున్నారని.. దాని ద్వారా ఆ వ్యక్తులతో పాటు యూట్యూబ్​ కూడా డబ్బులు సంపాదిస్తున్నట్లు ఆరోపించారు.

Also read: Chhattisgarh: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్... వారానికి ఐదు రోజులే డ్యూటీ..

Also read: Bihar Protests: ఆర్ఆర్‌బీ ఫలితాలపై వివాదం.. అట్టుడుకుతున్న బీహార్.. రైలుకు నిప్పంటించిన విద్యార్థులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News