Farmer protests Updates: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ( Farm laws ) రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ( Farmer Agitation ) ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన శుక్రవారంతో 30వ రోజుకు చేరింది. గడ్డకట్టే చలిలో కూడా రైతులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో నిరసనను కొనసాగిస్తున్నారు.
Farmers protest at Delhi's borders with Haryana at Singhu and Tikri enters 30th day
Farmer unions on 23rd December wrote to the government urging it not to repeat the "meaningless amendments" which they had earlier rejected and to come up with a concrete proposal in writing pic.twitter.com/39dhvKgyzA
— ANI (@ANI) December 25, 2020
అంతకుముందు కేంద్రం (Central Government) తో పలుమార్లు జరిగిన చర్చలు కూడా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. రైతులు వెనక్కి తగ్గకపోవడంతో ఢిల్లీ సరిహద్దుల్లో పలు రహదారులను మూసివేసి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. Also read: Farmer protests: రైతులందరూ ఆ లేఖను చదవాలి: ప్రధాని మోదీ
అయితే వ్యవసాయ చట్టాల్లో తమకు మార్పులు అవసరం లేదని.. వాటిని రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే సవరణలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రైతు సంఘాలు ఇప్పటికైనా నిరసనలను విరమించి చర్చలకు రావాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ (Narendra Singh Tomar) గురువారం తెలిపారు. కొన్ని సంఘాలు కొత్త వ్యవసాయ చట్టాలకు మద్దుతునిస్తున్నాయని వెల్లడించారు.
Also read; Farmer protests: వ్యవసాయ చట్టాల ప్రతులను చింపేసిన సీఎం కేజ్రీవాల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook