F2 Movie: ‘ఎఫ్ 2’ సినిమాకు జాతీయ అవార్డు

టాలీవుడ్‌లో ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ( Fun and Frustration) కథతో 2019లో వచ్చిన ఎఫ్-2 (F 2) సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. 2019లో విడుదలన టాప్ మోస్టెడ్ సినిమాల కన్నా.. ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ ఎఫ్ 2 సినిమా మంచి కలెక్షన్‌లను రాబట్టింది. కాగా ఈ సినిమాకు తాజాగా కేంద్ర అవార్డు లభించింది.

Last Updated : Oct 21, 2020, 02:43 PM IST
F2 Movie: ‘ఎఫ్ 2’ సినిమాకు జాతీయ అవార్డు

F2 film received feature film award: న్యూఢిల్లీ: టాలీవుడ్‌ (Tollywood) లో ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ( Fun and Frustration) కథతో 2019లో వచ్చిన ఎఫ్-2 (F 2) సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. 2019లో విడుదలన టాప్ మోస్టెడ్ సినిమాల కన్నా.. ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ ఎఫ్ 2 సినిమా మంచి కలెక్షన్‌లను రాబట్టింది. కాగా ఈ సినిమాకు తాజాగా కేంద్ర అవార్డు లభించింది. 2019 సంవత్సరానికి గానూ వివిధ భాషలకు చెందిన 26 సినిమాలకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ (Information and Broadcasting) అవార్డులను ప్రకటించింది. ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియా ద్వారా సినిమాల ఎంపిక చేపట్టగా..ఇందులో గతేడాది జనవరిలో విడుదలైన ‘ఎఫ్‌ 2’ సినిమాకు ఫీచర్ ఫిలిం కేటగిరిలో కేంద్ర అవార్డు లభించింది. Also read: Navratri Day 5: సరస్వతీ నమోస్తుతే.. చదువుల తల్లి అలంకరణలో అమ్మవారు

అయితే.. గతేడాది 2019లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాలో వెంకటేష్ (Daggubati Venkatesh), వరుణ్ తేజ్ (Varun Tej) హీరోలుగా తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, లక్ష్మణ్ ఈ సినిమాను నిర్మించగా.. దేవిశ్రీ ప్రసాద్ (DSP) సంగీతాన్ని అందించారు. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ కౌర్‌తోపాటు ఈ చిత్రంలో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ప్ర‌కాశ్‌రాజ్‌, సుబ్బ‌రాజు, ప్రగ‌తి, నాజ‌ర్, ఈశ్వ‌రీరావు, అన్న‌పూర్ణ‌మ్మ‌, వై విజ‌య తదితరులు నటించారు. అనిల్ రావిపూడి తనదైన స్టైల్లో ఈ చిత్రానికి దర్శకత్వం వహించి.. ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. Also read: Hyderabad Rains: బ్రహ్మాజీకి నెటిజన్ల షాక్.. ట్విట్టర్ నుంచి తప్పుకున్న నటుడు

అయితే.. ఫీచ‌ర్ ఫిలిం కేట‌గిరిలో ఎఫ్2 ( ఫన్ అండ్ ఫ్రస్టెషన్ ) కు జాతీయ అవార్డు ల‌భించడం పట్ల పలువురు హర్షం వ్యక్తంచేస్తున్నారు. అయితే.. 2019కి గాను ఈ అవార్డు సాధించిన ఏకైన తెలుగు సినిమాగా ఎఫ్2 నిల‌వ‌డం విశేషం. ఇదిలాఉంటే.. అనిల్ రావిపూడి ఎఫ్ 2 సీక్వెల్‌కు కూడా ప్లాన్ సిద్దం చేశాడు. త్వరలోనే ఈ సినిమా డిటైల్స్ ప్రక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. Also read: India hands over PLA soldier: చైనా సైనికుడిని అప్పగించిన భారత్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News