West Bengal assembly elections 2021: పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో 3వ విడత పోలింగ్‌లో భాగంగా నేడు పోలింగ్ జరగడానికంటే ముందుగానే అక్కడి అధికార పార్టీ టీఎంసీకి చెందిన ఓ నాయకుడి ఇంట్లో కొన్ని ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలు (EVMs and VVPATs) లభ్యమవడం రాజకీయవర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ఉలుబెరియా అసెంబ్లీ స్థానంలోని సెక్టార్ 17 ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోగా, ఈ ఘటనకు బాధ్యుడైన అక్కడి ఎన్నికల అధికారి తపన్ సర్కార్‌ని ఎన్నికల సంఘం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. తపన్ సర్కార్‌కి అటాచ్ చేసిన స్థానిక పోలీసు అధికారిపై సైతం ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. తపన్ సర్కార్ ఏ టీఎంసీ నేత ఇంట్లోనైతే ఆశ్రయం తీసుకున్నారో, ఆయనకు ఆ నేత బంధువు కూడా అవడం గమనార్హం.
టీఎంసీ నేత ఇంట్లో లభ్యమైన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను (EVMs and VVPATs) ఎన్నికల విధుల్లో ఉపయోగించకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఎన్నికల సంఘం ఆదేశాలను పూర్తిగా బేఖాతరు చేసి తపన్ సర్కార్ తీవ్రమైన నేరానికి పాల్పడ్డారని, అందుకే అతడిని సస్పెండ్ చేయడం జరిగిందని ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో పేర్కొంది. ఎన్నికల సంఘం ఆదేశాలను నిర్లక్ష్యం చేసిన తపన్ సర్కార్‌పై (Tapan Sarkar) తీవ్రమైన అభియోగాలు నమోదు చేసి అతడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోనున్నట్టు ఎన్నికల సంఘం స్పష్టంచేసింది.
Also read : Tamil Nadu Elections 2021: డీఎంకే విజయంపై ఎంకే స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీఎంసీ నేత ఇంట్లో లభ్యమైన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను పరిశీలించిన జనరల్ అబ్జర్వర్ నీరజ్ పవన్.. వాటిని అబ్జర్వర్స్ కస్టడీలో ప్రత్యేక గదిలో భద్రపరిచారు. ఏప్రిల్ 29న వెస్ట్ బెంగాల్‌లో (West Bengal assembly elections 2021) చివరి విడత ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా, మే 2న ఓట్లను లెక్కించనున్నారు.
ఓటర్ల ఓట్లను దోచుకోవడం కోసం టీఎంసీ వేసిన ఎత్తుగడలో భాగంగానే ఇలా ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను (EVMs and VVPATs) టీఎంసీ నేత ఇంటికి తీసుకెళ్లారని బీజేపి (BJP) ఆరోపించింది. బీజేపి చేస్తోన్న ఈ ఆరోపణలను టీఎంసీ ఏ విధంగా తిప్పికొడుతుందో వేచిచూడాల్సిందే మరి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
EVMs, VVPATs: టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎంలు,వీవీప్యాట్ యంత్రాలు.. పోల్ ఆఫీసర్‌పై EC వేటు
పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో నేడు 3వ విడత పోలింగ్
పోలింగ్ జరగడానికంటే ముందుగానే టీఎంసీ నాయకుడి ఇంట్లో లభ్యమైన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలు.
పోల్ ఆఫీసర్ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణిస్తూ అతడిని సస్పెండ్ చేసిన ఈసీ