How To Know UAN: ప్రతి పీఎఫ్ ఎక్కౌంట్‌కు యూఏఎన్ నెంబర్ కీలకం. యూఏఎన్ ఆధారంగా ఆన్‌లైన్ పాస్‌బుక్స్ అన్నీ సాధ్యమే. ఒకవేళ మీకు యూఏఎన్ నెంబర్ తెలియకపోతే..సులభంగా తెలుసుకోవచ్చు. అదెలాగో చూద్దాం..
యూనివర్శల్ ఎక్కౌంట్ నెంబర్ అనేది 12 సంఖ్యల డిజిటల్ నెంబర్. ప్రతి ఉద్యోగికి ఈపీఎఫ్ఓ కేటాయిస్తుంది. పీఎఫ్ ఎక్కౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ యూఏఎన్ నెంబర్ కేటాయిస్తారు. ఉద్యోగం మారినా సరే ఆ నెంబర్ ఇలాగే ఉంటుంది. ఉద్యోగి ఎవరైనా ఉద్యోగం మారితే..ఈపీఎఫ్ఓ కార్యాలయం కొత్త నెంబర్ కేటాయిస్తుంది. అయితే ఈ నెంబర్ యూఏఎన్ నెంబర్‌కు అనుసంధానమౌతుంది.
ఉద్యోగి వివిధ కంపెనీల్లో చేసే ఉద్యోగాల సందర్భంగా కేటాయింపబడే పలు పీఎఫ్ ఎక్కౌంట్లకు యూఏఎన్ అనేది ఓ గొడుగులాంటిది. పీఎఫ్ నెంబర్లు ఎన్ని మారినా..యూఏఎన్ నెంబర్ ఒకటే ఉంటుంది. దీనివల్ల కంపెనీ మారినా..ఉద్యోగికి పీఎఫ్ ఎక్కౌంట్ విషయంలో ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఉంటుంది. యూఏఎన్ ఆధారంగా ఒకే పీఎఫ్ ఎక్కౌంట్ కలిగి ఉండవచ్చు. ఈ నెంబర్ ఆధారంగా ప్రతి ఉద్యోగి ఆన్‌లైన్ విధానంలో పాస్‌బుక్స్, బదిలీ రిక్వెస్టుల ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
మీకు మీ యూఏఎన్ నెంబర్ తెలియకపోతే..ఈపీఎఫ్ వెబ్‌సైట్ https://www.epfindia.gov.in/సందర్శించి తెలుసుకోవచ్చు. ముందుగా హోమ్‌పేజ్‌లో సర్వీసెస్ ట్యాబ్ ఎంచుకోవాలి. ఆ తరువాత ఫర్ ఎంప్లాయిస్ సెలెక్ట్ చేయాలి. ఇక ఆ తరువాత మెంబర్ యూఏఎన్ లేదా ఆన్‌లైన్ సర్వీస్ ఆప్షన్‌లో వెళ్లి..సర్వీసెస్ సెక్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడిక ఇంపార్టెంట్ లింక్స్ విభాగంలో వెళ్లి..నో యువర్ యూఏఎన్ సెలెక్ట్ చేయాలి. తరువాత పేజిలో మీ ఐడీ, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తరువాత మరో పేజిలో మీ పుట్టినతేదీ, మొబైల్ నెంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి. ఇక క్యాప్చా ఎంటర్ చేసి..ఆథరైజేషన్ కోడ్ నమోదు చేయాలి. వెంటనే మీ మొబైల్ నెంబర్‌కు మీ యూఏఎన్ నెంబర్ వస్తుంది.
Also read: National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌లకు ఈడీ నోటీసులు... అసలేంటీ కేసు..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook