Electoral Bonds: ఎన్నికల బాండ్లపై ఏదీ దాచవద్దు, ఎస్బీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Electoral Bonds: ఎన్నికల బాండ్ల వ్యవహారాన్ని సుప్రీంకోర్టు చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు కన్పిస్తోంది. అంత తేలిగ్గా వదిలేట్టు లేదు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 18, 2024, 01:44 PM IST
Electoral Bonds: ఎన్నికల బాండ్లపై ఏదీ దాచవద్దు, ఎస్బీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Electoral Bonds: సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశంలో ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ఎన్నికల బాండ్లను నిషేదించడమే కాకుండా ఆ వివరాలు పూర్తిగా బహిర్గతం చేయాలని ఎస్బీఐకు ఆదేశించిన సుప్రీంకోర్టు అంతటితో ఆగలేదు. ఎస్బీఐ అందించిన ఎన్నికల బాండ్ల వివరాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తి స్థాయిలో బాండ్ల వివరాలు అందించాలంటూ డెడ్‌లైన్ విధించింది. 

ఫిబ్రవరి 15న ఎన్నికల బాండ్లను నిషేధిస్తూ సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు అప్పట్నించి ఎస్బీఐ వెంటపడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎదో దాయాలని ప్రయత్నిస్తుండటంతో సుప్రీంకోర్టుకు ఆగ్రహం కలిగింది.  తాజాగా మరోసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై కన్నెర్ర జేసింది. మార్చ్ 21వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఏ రాజకీయ పార్టీకు ఏ సంస్థ ఎంతెంత విరాళాలు ఇచ్చిందో ఆల్ఫాన్యూమరికల్ ఆర్డర్ కోడ్‌తో సహా బాండ్ల నెంబర్లతో అందించాలంటూ అల్టిమేటం జారీ చేసింది. అంతేకాకుండా ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి ఇక ఎలాంటి వివరాలు దాచిపెట్టలేదని ధృవీకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖేరాను ఆదేశించింది. 

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఎస్బీఐ సెలెక్టివ్‌గా ఉండకూడదని, ప్రతి సమాచారం బయటకు రావాలని, ఏ విషయాన్ని దాచిపెట్టకూడదనే ఉద్దేశ్యంతోనే తీర్పు ఇచ్చామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఏ దాత ఎంత ఇచ్చాడనే వివరాలు, యూనిక్ నెంబర్లతో సహా ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. 

ఎస్బీఐ ఎన్నికల సంఘానికి ఇప్పటికే ఇచ్చిన డేటాలో పూర్తి సమాచారం లేకపోవడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేస్తే కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవల్సి వస్తుందని కూడా హెచ్చరించింది. పూర్తి సమాచారం కోసం మరోసారి విచారణ జరిపింది. మార్చ్ 21 డెడ్‌లైన్ విధించి..ఆలోగా ఎన్నికల బాండ్ల గురించి సమగ్ర సమాచారం దాచుకోకుండా ఇవ్వాలని ఆదేశించింది. ఇక తమ వద్ద ఏం సమాచారం లేదనేట్టుగా అఫిడవిట్ కూడా ఇవ్వాలని ఆదేశించింది. 

Also read: Loksabha Elections Impact: పరీక్షలపై లోక్‌సభ ఎన్నికల ప్రభావం, ఏయే పరీక్షలు వాయిదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News