Electoral Bonds Donations: రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే ఎలక్టోరల్ బాండ్లను నిషేధిస్తూ ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మార్చ్ 12లోగా విరాళాల వివరాలు సమర్పించాలని ఆదేశించడంతో గడువు పొడిగించాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. కానీ ఇప్పటివరకూ ఏం చేశారంటూ ఆగ్రహించిన న్యాయస్థానం ఇవాళ అంటే మార్చ్ 12లోగా విరాళాల వివరాలు సమర్పించాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా విరాళాలు పొందిన పార్టీగా బీఆర్ఎస్ ఉందని తెలుస్తోంది. తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ 2022-23 ఆర్ధిక సంవత్సరంలో అత్యధికంగా 683 కోట్ల విరాళాలు పొందింది. ఇందులో మేజర్ వాటా 529 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సమకూరినవే కావడం గమనార్హం. వీటిలో 80 శాతం బహిర్గతం చేయని మూలాల నుంచి విరాళాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇతర దాతల నుంచి 154 కోట్లు వచ్చాయి. ఈ 154 కోట్లతో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కరీంనగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజపుషా, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర వద్దిరాజు, గాయత్రీ గ్రానైట్స్ ఎండీ పి జయచంద్రారెడ్డిలు 10 కోట్లు చొప్పున ఇచ్చారు. 2023 నవంబర్‌లో జరిగిన తెలంగాణ ఎన్నికలకు ముందు 1148 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు సేకరించినట్టు తెలుస్తోంది. ఇందులో ఎస్బీఐ హైదరాబాద్ బ్రాంచ్ నుంచే గరిష్టంగా 376 కోట్లు సేకరించారు.
ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 52 కోట్లు సేకరించింది. వ్యక్తిగత విరాళాలు ఈ పార్టీకు 30 లక్షలు వచ్చాయి. ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా 16 కోట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకు వ్యక్తిగత విరాళాల ద్వారా 11.92 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ ఎలక్టోరల్ బాండ్లను సేకరించలేదని సమాచారం.
Also read: CAA Protest: సీఏఏ అమలుపై ప్రతిపక్షాల అభ్యంతరం, ఎంఐఎం నేత అసదుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook