Anil Deshmukh: 'ముందు కొన్నాళ్లు జైలు భోజనం తినండి.. ఆ తర్వాత చూద్దాం'

 Anil Deshmukh: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన.. మాహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్​ దేశ్​ముఖ్​కు కోర్టులో చుక్కెదురైంది. ఇంటి భోజనం తెచ్చుకునేందుకు అనుమతించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2021, 10:31 PM IST
  • అనిల్​ దేశ్​ముఖ్​కు ప్రత్యేక న్యాయస్థానం చురకలు
  • కొన్ని రోజులు జైలు భోజనం తినాల్సిందేనని స్పష్టం
  • మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ పొడగింపు
Anil Deshmukh: 'ముందు కొన్నాళ్లు జైలు భోజనం తినండి.. ఆ తర్వాత చూద్దాం'

EX Home Minister of Maharashtra Anil Deshmukh has been sent to judicial custody for 14 days: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన.. మాహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్​ దేశ్​ముఖ్​కు ప్రత్యేక న్యాయస్థానం (Special Court on Anil Deshmukh) చురకలంటించింది. ఇంటి భోజనం తెప్పించుకునేందుకు అనుమతించాలంటూ.. కోర్టుకు అనిల్ దేశ్​ముఖ్​ దరఖాస్తు చేసుకోగా.. 'ముందు కొన్ని రోజులు జైలు ఆహారం తినండి. ఏదైనా ఇబ్బంది ఉండే తర్వాత మీ వినతిని పరిశీలిస్తా' అని స్పెషల్ కోర్టు జడ్జి స్పష్టం చేశారు.

అయితే తన ఆరోగ్యం, వయస్సు (71) దృష్ట్య జైలులో బెడ్ ఏర్పాటు చేయాలనే వినతిని మాత్రం కోర్టు అంగీకరించింది.

దేశ్ ముఖ్ అరెస్టు ఇలా..

ఈ ఏడాది ఏప్రిల్​లో అనిల్​ దేశ్​ముఖ్​పై సీబీఐ అవినితీ కేసు (Anil Dehsmukh case) ఫైల్ చేసిన తర్వాత.. ఆయనపై విచారణ ప్రారంభమైంది. ఇందులో భాగంగా నవంబర్ 1న ఆయన్ను ముంబయిలోని ఆయన ఆఫీసులో 12గంటల పాటు ప్రశ్నించింది ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). ఆదే రోజు అర్ధరాత్రి ఆయన్ను అరెస్టు (ED case on Anil Dehsmukh) చేసింది. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆదివారంతో ఆ గడువు ముగిసింది.

Also read: Suriya Jai Bhim: హీరో సూర్యపై దాడి చేస్తే రూ.1లక్ష... పీఎంకె నేత సంచలన ప్రకటన

ఈ నేపథ్యంలో ఆయన్ను సోమవారం ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు. అయితే ఈడీ సహా ఇతర దర్యాప్తు సంస్థలు ఆయన కస్టడీ పొడగించాలని కోరడంతో.. మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ (Judicial custody Extended to Anil Deshmukh) విధించింది ప్రత్యేక న్యాయస్థానం.

ఈ నేపథ్యంలోనే అనిల్ దేశ్​ముఖ్ తరఫు న్యాయవాదులు ఆయనకు ఇంటి భోజనం, బెడ్​ అందించాలని కోర్టును కోరారు.

Also read: Gang rape: రైల్వే కోచ్‌లో ఉరేసుకున్న యువతి... గ్యాంగ్ రేప్ జరిగినట్లు పోలీసుల అనుమానం

Also read: Railway Reservation: రైల్వే ప్రయాణికులకు కీలక అలర్ట్.. 7 రోజులు, ప్రతీరోజూ 6 గంటలు రిజర్వేషన్ సేవలు నిలిపివేత

అనిల్ దేశ్​ముఖ్​పై కేసు ఏమిటి?

ముకేశ్‌ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల వాహనం కేసులో పోలీసు అధికారి సచిన్‌వాజే అరెస్టు తర్వాత.. అనిల్ దేశ్​ముఖ్​కు చిక్కులు మొదలయ్యాయి.

ప్రతి నెల రూ.100 కోట్లు వసూళు చేయాలని అనిల్​ దేశ్​ముఖ్​ సచిన్ వాజేకు లక్ష్యంగా పెట్టారని.. ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల తర్వాత అనిల్ దేశ్​ముఖ్​ తన హోం మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయనపై మనీలాండరింగ్​ కేసులు నమోదైంది.

Also read: Delhi lockdown: 'ఢిల్లీలో అవసరమైతే పూర్తి స్థాయి లాక్​డౌన్​కు రెడీ'

Also read: Judiciary System: తీర్పులు ఎప్పుడూ సులభమైన భాషలోనే ఉండాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News