Dussehra Special Train Tickets Hike: గతేడాది కరోనా కారణంగా దసరా వేడుకలు అంతంత మాత్రంగానే జరిగాయి, కానీ ఈ సారి కరోనా కాస్త తగ్గుముఖం పట్టడటంతో ఘనంగా దసరా ఉత్సవాలు జరపాలని నిర్ణయించటంతో జనాలు పట్టణాలు వదిలి సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు.
కానీ గతేడాది కరోనా కారణంగా రవాణా వ్యవస్థల ఆదాయం పడిపోగా.. ఈ దసరా పండుగను సొమ్ముకి చేసుకోవాలని చూస్తున్నాయి. స్పెషల్ బస్సులు, రైళ్ల పేరుతో జనాల జేబుకు దండికొడుతుంది.
Also Read: Neelima Shocking comments: సమంత గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన నీలిమ గుణ
ముఖ్యంగా మన రైల్వే రవాణా వ్యవస్థ స్పెషల్ రైళ్ల చార్జీలు పెంచటంపై తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు చార్జీలు తగ్గించి లేదా అంతే చార్జీలతో ప్రజలకు టికెట్లు సమకూర్చాల్సిందిపోయి, చార్జీలు పెంచి ప్రజలపై భారం పెంచుతుంది. దసరా ప్రత్యేక రైళ్లు, తత్కాల్ టికెట్ల పేరుతో ఒక్కో ప్రయాణికుడిపై దాదాపు 200 శాతం వరకు అదనపు చార్జీలు వసూలు వేస్తున్నారు.
బోగీ రకం, ప్రయాణికుల మధ్య దూరాన్ని బట్టి ఒక్కో ప్రయాణికుడిపై రూ. 200 నుండి రూ.700 వరకు వసూలు చేస్తున్నారు. పండగ కారణంగా మన తెలుగు రాష్ట్రాల నుండి ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా మరియు బీహార్ వంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లే రైళ్ల ధరలు విపరీతంగా పెంచేశారు.
Also Read: Hyderabad Heavy Rains: ఆగకుండా కురిసిన వర్షానికి ఆగమైన రాజధాని.. Videos
రైల్వే శాఖ మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ లో దసరా పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల చార్జీలు పెంచటం మరియు విమాన ప్రయాణ చార్జీలు పెంచటంతో ప్రజలపై భారం పెరుగుతూనే ఉంది. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాల కాలం పాటు రవాణా సంస్థలు కోల్పోయిన ఆదాయం మొత్తం ఈ దసరా పండగ సీజన్ తో సమకూర్చుకోవాలని ఆయా రవాణా సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook