Drugs case: డ్రగ్స్ కేసులో.. హీరోయిన్లు సారా, రకుల్?

బాలీవుడ్ యువనటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ( Sushant Singh Rajput death case ) ఆరోపణలు ఎదుర్కొంటూ.. డ్రగ్స్ కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తి (Rhea Chakraborty) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే వరుసగా మూడు రోజులపాటు ప్రశ్నించిన అనంతరం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) రియా చక్రవర్తని అరెస్ట్ చేసింది. ఈ డ్రగ్స్ కేసు విచారణలో రియా చక్రవర్తి ఎన్‌సీబీ అధికారులకు పలు కీలక పేర్లను వెల్లడించినట్లు సమాచారం.

Last Updated : Sep 12, 2020, 09:18 AM IST
Drugs case: డ్రగ్స్ కేసులో.. హీరోయిన్లు సారా, రకుల్?

Rhea Chakraborty several names tells in NCB interrogation:  న్యూఢిల్లీ: బాలీవుడ్ యువనటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ( Sushant Singh Rajput death case ) ఆరోపణలు ఎదుర్కొంటూ.. డ్రగ్స్ కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తి (Rhea Chakraborty) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే వరుసగా మూడు రోజులపాటు ప్రశ్నించిన అనంతరం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) రియా చక్రవర్తని అరెస్ట్ చేసింది. అంతకు ముందు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి సహా పలువురిని సైతం ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది. నిన్ననే ముంబై హైకోర్టు రియాతో సహా వారందరి బెయిల్ పిటషన్లను తిరస్కరించింది. ఇదిలాఉంటే.. డ్రగ్స్ కేసు విచారణలో రియా చక్రవర్తి ఎన్‌సీబీ అధికారులకు పలు కీలక పేర్లను వెల్లడించినట్లు సమాచారం. Also read: Rhea Chakraborty: సుశాంత్ గాళ్‌ఫ్రెండ్ కాల్ డేటాలో రానా, రకుల్, అమీర్ ఖాన్ పేర్లు

అయితే బాలీవుడ్‌లో డ్రగ్స్ తీసుకునే పలువురు పేర్లను ఎన్సీబీకి రియా వెల్లడించిట్లు తెలిసింది. వారిలో టాలీవుడ్‌తోపాటు.. పలు బాలీవుడ్ సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించిన హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్ (Rakul Preet Singh)‌, బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ కుమార్తె, నటి సారా అలీఖాన్ (Sara Ali Khan)‌, డిజైనర్ సిమోన్ ఖంబట్టా, సుశాంత్ స్నేహితుడు, మాజీ మేనేజర్ రోహిణి అయ్యర్, చిత్రనిర్మాత ముఖేష్ ఛబ్రా పలువురు బాలీవుడ్ ప్రముఖులు డ్రగ్స్ తీసుకునే వారని రియా ఎన్‌సీబీకి వెల్లడించిందని తెలిసింది. అయితే వారిని కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పిలిపించి విచారించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.   Also read: Kim Jong-un: నార్త్ కొరియాలో అరాచకం.. కరోనా వ్యాపించకుండా కాల్చివేత ఉత్తర్వులు!

జూన్ 14 న ముంబైలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత.. ఈ కేసును అనేక కోణాల్లో సీబీఐ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో డ్రగ్స్ వ్యవహారంలో రియా, ఆమె సోదరుడు పలువురు ఎన్‌సీబీ అరెస్టు చేసింది.   Also read: Ketika Sharma: కేతిక అందాలు అదరహో..

Trending News