EV Charging Stations: దేశంలో విద్యుత్ వాహనాల (ఈవీ) వినియోగం క్రమంగా పెరుగుతోంది. అయితే చాలా మంది విద్యుత్ వాహనాలను వాడేందుకు మొగ్గు చూపుతున్నప్పటికీ.. ఛార్జింగ్ స్టేషన్ అనేది పెద్ద సమస్యగా ఉంది. దీనితో ప్రభుత్వం, ప్రైవేటు కంపెనీలు ఈవీలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను పెంచేందుకు కసరత్తు చేస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై కేంద్ర విద్యుత్ శాఖ కీలక ప్రకటన చేసింది. దేశంలో ప్రస్తుతం తొమ్మిది నగరాల్లో ఈవీ స్టేషన్లు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. ఢిల్లీ, ముంబయి, చెన్నై నగరాల్లో గత గడిచిన నాలుగు నెలల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య రెండున్నర రెట్లు పెరిగినట్లు వివరించింది.
ఛార్జింగ్ స్టేషన్లు ఉన్న నగరాలు ఇవే..
దేశంలో ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, అహ్మదాబాద్, సూరత్, పుణే నగరాల్లో 2021 అక్టోబర్ నుంచి 2022 జనవరి మధ్య 678 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఇన్స్టాల్ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఇక దేశవ్యాప్తంగా మొత్తం 1,640 ఛార్జింగ్ స్టేషన్లు ఉండగా.. అందులో 940 ఈ తొమ్మిది నగరాల్లోనే ఉండటం విశేషం. 40 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న ఈ నగరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తొలుత ఈ నగరాల్లో భారీగా ఛార్జింగ్ స్టేషన్లను పెంచాలని భావిస్తోంది.
ప్రైవేటు పెట్టుబడుల్లో వృద్ధి..
ఛార్జింగ్ స్టేషన్లు పెరిగితే దేశంలో విద్యుత్ వాహనాల వినియోగం భారీగా పెరగొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీనితో ప్రభుత్వం.. ప్రైవేటు, ప్రభుత్వం ఏజెన్సీలను కలుపుకుని మౌలిక వసతుల పెంపునకు కృషి చేస్తోంది. బీఈఈ, ఈఈఎస్ఎల్, పీజీసీఐఎల్, ఎన్టీపీసీ సహా వివిధ సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం పంచుకుంటున్నాయి.
చమురు మార్కెటింగ్ సంస్థలు కూడా..
దేశంలోని ప్రముఖ చమురు మార్కెటింగ్ సంస్థలు కూడా విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడం కోసం ముందుకొస్తున్నాయి.
దేశవ్యాప్తంగా వివిధ పట్టణాలు, జాతీయ రహదారుల వెంబడి 22 వేల ఈవీ ఛార్జంగ్ స్టేషన్లు నెలకొల్పనున్నట్లు ప్రకటించాయి. ఇందులో 10 వేలు ఐఓసీఎల్, 7,000 భారత్ పెట్రోలియం కార్పొరేషన్, 5,000 హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్నాయి.
Also read: UGC NET Result declared: యూజీసీ నెట్ 2021 పరీక్ష ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
Also read: JEE Mains Exams Update: జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఈసారి రెండు సార్లే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook