Devendra Fadnavis, Sanjay Raut: హోటల్లో ఫడ్నవిస్, సంజయ్ రౌత్ భేటీ

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివ సేన పార్టీ ఎంపీ, కీలక నేత అయిన సంజయ్ రౌత్ ( Devendra Fadnavis, Sanjay Raut meeting ) శనివారం ముంబైలోని ఓ లగ్జరీ హోటల్లో వీళ్లిద్దరూ సమావేశం కావడం రాజకీయవర్గాల్లో చర్చనియాంశమైంది. బీజేపి అంటేనే ఒంటికాలుపై లేస్తున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ( Shiv Sena MP Sanjay Raut ) ఇలా బీజేపి కీలక నేతతో రహస్య మంతనాలు ఏంటా అని అందరూ ఆశ్చర్యపోయారు.

Last Updated : Sep 27, 2020, 01:10 AM IST
Devendra Fadnavis, Sanjay Raut: హోటల్లో ఫడ్నవిస్, సంజయ్ రౌత్ భేటీ

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివ సేన పార్టీ ఎంపీ, కీలక నేత అయిన సంజయ్ రౌత్ ( Devendra Fadnavis, Sanjay Raut meeting ) శనివారం ముంబైలోని ఓ లగ్జరీ హోటల్లో వీళ్లిద్దరూ సమావేశం కావడం రాజకీయవర్గాల్లో చర్చనియాంశమైంది. బీజేపి అంటేనే ఒంటికాలుపై లేస్తున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ( Shiv Sena MP Sanjay Raut ) ఇలా బీజేపి కీలక నేతతో రహస్య మంతనాలు ఏంటా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఐతే బీజేపి మాత్రం వీళ్ల భేటీకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టంచేసింది. 

శివ సేనకు చెందిన సొంత పత్రిక సామ్నా ( Saamna ) కోసం దేవేంద్ర ఫడ్నవీస్ నుండి సంజయ్ రౌత్ ఓ ఇంటర్వ్యూ తీసుకోవాలనుకున్నారని.. అందులో భాగంగానే ఈ భేటీ జరిగిందని మహారాష్ట్ర బీజేపి ముఖ్య అధికార ప్రతినిధి కేశవ్ ఉపాధ్యే తెలిపారు. బీహార్ ఎన్నికల ప్రచారం నుంచి తిరిగొచ్చాక తాను ఇంటర్వ్యూ ఇస్తానని దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారని కేశవ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. 

మరోవైపు సంజయ్ రౌత్ ఈ విషయంపై స్పందిస్తూ... దేవేంద్ర ఫడ్నవిస్‌ని కలవడం ఏమైనా నేరమా అని ప్రశ్నించారు. ''ఆయన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కావడమే కాకుండా ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు కూడా'' అని అభిప్రాయపడిన సంజయ్ రౌత్.. ''తాను శరద్ పవార్‌ని ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడే.. భవిష్యుత్తులో ఫడ్నవీస్ ( Sanjay Raut interview with Devendra Fadnavis ), రాహుల్ గాంధీ, అమిత్ షాల ఇంటర్వ్యూలు కూడా తీసుకుంటానని చెప్పాననే విషయాన్ని రౌత్ గుర్తుచేసుకున్నారు. 

 

Trending News