Omicron cases in India: దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్క రోజులోనే కొత్తగా ఆరు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డట్లు ఢిల్లీ ఆరోగ్య విభాగం (Delhi Omicron cases) సోమవారం ప్రకటించింది.
తాజా కేసులతో కలిపి ఢిల్లీలో మొత్తం కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల (Omicron cases in Delhi) సంఖ్య 28కి పెరిగింది. ఇందులో 12 మంది ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు ఆరోగ్య విభాగం తెలిపింది. ఇంకా 16 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది.
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఐసోలేషన్ యూనిట్లు..
విదేశాల నుంచి వస్తున్న వారిలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ రోగులకోసం ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్థానికంగా ఉండే మూడు ప్రైవేటు ఆస్పత్రులకు సూచించింది.
దేశవ్యాప్తంగా 168కి ఒమిక్రాన్ కేసులు..
దేశవ్యాప్తంగా కూడా కరోనా ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 168 మందికి ఒమిక్రాన్ వేరియంట్ (Omicron cases in India) నిర్ధారణ అయ్యింది.
కర్ణాటకలో మరో ఐదుగురికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. కేరళలో నాలుగు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి.
దేశంలో ఇప్పటి వరకు ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో ఒమిక్రాన్ కేసులు భయటపడ్డాయి. ఇందులో ఎక్కువ మొత్తం కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి.
Also read: Omicron symptoms: ముక్కు కారడం, గొంతులో మంటగా ఉందా? అది ఒమిక్రాన్ కావచ్చు!
Also read: Corona cases in India: దేశంలో 7 వేల దిగువకు కొత్త కేసులు- మరణాల్లోనూ భారీ క్షీణత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook