Delhi Politics: కేజ్రీవాల్‌‌తో సమావేశానికి ఎమ్మెల్యేల డుమ్మా..? బీజేపీతో టచ్‌లోకి..? మలుపులు తిరుగుతున్న ఢిల్లీ రాజకీయం..

Delhi Political Updates: ఆప్‌కి సొంతంగా 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.ఇవాళ జరిగిన ఆప్ సమావేశానికి వీరిలో 12 మంది డుమ్మా  కొట్టారనే ప్రచారం జరుగుతోంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 25, 2022, 01:02 PM IST
  • ఆప్ సర్కార్‌లో కలవరం..?
  • కేజ్రీవాల్‌తో సమావేశానికి ఎమ్మెల్యేల డుమ్మా
  • బీజేపీతో టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం..
Delhi Politics: కేజ్రీవాల్‌‌తో సమావేశానికి ఎమ్మెల్యేల డుమ్మా..? బీజేపీతో టచ్‌లోకి..? మలుపులు తిరుగుతున్న ఢిల్లీ రాజకీయం..

Delhi Political Updates: లిక్కర్ స్కామ్ ఎపిసోడ్‌‌తో ఒక్కసారిగా హీటెక్కిన ఢిల్లీ పాలిటిక్స్‌ అనుకోని మలుపులు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ప్రస్తుతం ఈ ఎమ్మెల్యేలంతా టచ్‌లో లేకుండా పోయారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆప్ ప్రభుత్వంలో కలవరం మొదలైనట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కా బీజేపీ ప్లాన్ అని ఆమ్ ఆద్మీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆప్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభ పెడుతోందని ఆ పార్టీ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు.

ఆప్‌కి సొంతంగా 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.ఇవాళ జరిగిన ఆప్ సమావేశానికి వీరిలో 12 మంది డుమ్మా  కొట్టారనే ప్రచారం జరుగుతోంది. తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని.. 40 మంది ఎమ్మెల్యేలను పార్టీ నుంచి చీల్చేందుకు కుట్ర చేస్తోందని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. ఇందుకు గాను ఒక్కో ఎమ్మెల్యేకి రూ.20 కోట్ల చొప్పున బీజేపీ ఆఫర్ చేసినట్లు సంచలన ఆరోపణలు చేశారు. అయినప్పటికీ తమ ఎమ్మెల్యేలెవరూ బీజేపీకి లొంగలేదని అన్నారు. 

ఇవాళ్టి సమావేశానికి 53  మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని.. మిగతావారిలో ప్రస్తుతం స్పీకర్ విదేశాల్లో ఉన్నారని, మనీష్ సిసోడియా హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నారని సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. మిగతా ఎమ్మెల్యేలతోనూ సీఎం కేజ్రీవాల్ మాట్లాడారని.. తమ చివరి శ్వాస వరకు ఆయన వెంటే ఉంటామని వారు స్పష్టం చేశారన్నారు. బీజేపీ 'ఆపరేషన్ లోటస్' విఫలమైందన్నారు.

కాగా, ఆమ్ ఆద్మీ నేతలను నయానో, భయానో తమవైపుకు తిప్పుకునేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందనే ఆరోపణలు ఆప్ నేతల నుంచి వినిపిస్తున్నాయి. కేసుల పేరుతో భయపెట్టి లేదా ప్రలోభాలకు గురిచేసి ఎమ్మెల్యేలను లాగేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల వెలుగుచూసిన లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీష్ సిసోడియా బీజేపీపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆప్‌ను చీల్చితే తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందని... అందుకు ఒప్పుకుంటే సీబీఐ, ఈడీ కేసులు ఉండవని ఆ పార్టీ నుంచి తనకు సందేశం వచ్చిందని సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ అప్రమత్తమయ్యారు. ఇవాళ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగే, శుక్రవారం (ఆగస్టు 26) ఉదయం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని నిర్ణయించారు.

Also Read: Liger Movie Review: విజయ్ దేవరకొండ "నత్తి విశ్వరూపం" ఎలా ఉందంటే?

Also Read:Kuppam Babu Tour Live Updates: కుప్పంలో టెన్షన్‌..టెన్షన్..ఇక్కడి నుంచే ధర్మపోరాటమన్న చంద్రబాబు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News