Delhi Fog: మొన్నటి వరకూ కాలుష్యంతో ఇబ్బంది పడిన ఢిల్లీ ప్రజలు ఇప్పుడు పొగమంచుతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దట్టమైన పొగమంచు ఢిల్లీ నగరాన్ని కప్పేసింది. ఫలితంగా అటు రోడ్డు రవాణాతో పాటు రైలు, విమానయానంపై తీవ్ర ప్రభావం కన్పిస్తోంది. వాతావరణ శాఖ కూడా ఢిల్లీకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఢిల్లీలో రోజురోజుకూ ఉష్ణోగ్రత పడిపోతోంది. చలి తీవ్రత పెరుగుతోంది. మరోవైపు పొగమంచు తీవ్రంగా కప్పేయడంతో దృశ్యమాన్యత అంటే విజిబిలిటీ తగ్గిపోయింది. ఫలితంగా ఇప్పటికే రోడ్లపై రవాణా స్థంబించిపోతోంది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురౌతోంది. మరోవైపు రైళ్ల రాకపోకలపై ప్రభావం పడుతుంది. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుంటే మరి కొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఆరు రైలు సర్వీసుల్ని దారి మళ్లించినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో వాయు నాణ్యత పూర్తిగా పడిపోయింది. ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. ఢిల్లీ సఫ్దర్జంగ్లో కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీలు నమోదైంది.
మరోవైపు విమాన సర్వీసులపై కూడా పొగమంచు ప్రభావం పడింది. ఏడు విమానాలు రద్దయ్యాయి. 184 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు విమాన సర్వీసులపై ఇదే ప్రభావం పడవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.