Delhi Floods: యమున చరిత్రలో అత్యధిక వరద, జలదిగ్భంధనంలో ఢిల్లీ ఎర్రకోట

Delhi Floods: యమునా నది ఉధృతికి దేశ రాజధాని నగరం ఢిల్లీ ఒణికిపోతోంది. ముంచెత్తిన వరద నీటితో ఢిల్లీ నగరం జలదిగ్భంధనంలో చిక్కుకుంది. అజేయంగా, ఠీవిగా నిలిచే ఎర్రకోటను కూడా వరద ముప్పు ముంచేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 13, 2023, 10:37 PM IST
Delhi Floods: యమున చరిత్రలో అత్యధిక వరద, జలదిగ్భంధనంలో ఢిల్లీ ఎర్రకోట

Delhi Floods: యమునా నది చరిత్రలో ఇదే అత్యధిక వరద. దేశ రాజధాని నగరం ఢిల్లీ తల్లడిల్లిపోతోంది. యమునా నది వరద ఉధృతికి ఢిల్లీ మునిగిపోతోంది. నగరమంతా జలదిగ్భంధనమైంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీటితో మునిగిపోయాయి. ఢిల్లీ ప్రజలు ఇప్పుడు తాగునీటికి కటకటలాడుతున్నారు. 

దేశ రాజధాని ఢిల్లీలోకి యుమునా నది చొచ్చుకొచ్చేసింది.  45 ఏళ్ల రికార్డును తుడిచిపెట్టి యమునా నది చరిత్రలోనే అత్యధిక వరద నమోదైంది. 1978లో అత్యధికంగా 207.49 మీటర్ల వరద నమోదైంది. ఇప్పటి వరకూ ఇదే అత్యధిక వరద. ఇప్పుడు అంతకుమించి 208.66 మీటర్లు దాటి వరద ప్రవహిస్తోంది. అందుకే యమునా నది ఢిల్లీ నగరంలోకి దూసుకొచ్చింది. భారీ వర్షాలకు తోడు హర్యానా నుంచి వచ్చిన వరద నీరు తోడవడంతో యుమనా నది ఉప్పొంగింది. ఢిల్లీలోని రోడ్లు, వీదుులు నదుల్ని తలపిస్తున్నాయి. ఆఖరికి ఢిల్లీ ల్యాండ్ మార్క్, ఠీవిగా కన్పించే ఎర్రకోటను కూడా వరద నీరు ముంచెత్తింది. ఢిల్లీ ఎర్రకోట ఇప్పుడు వరద గుప్పిట్లో ఉంది.

యమునా నది వరద ప్రవాహంలో చిక్కుకున్న లోతట్టు ప్రాంతాల్ని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగి నిరంతరం శ్రమిస్తున్నాయి. ఢిల్లీలోని స్కూళ్లు, కళాశాలలకు ఆదివారం వరకూ సెలవు ప్రకటించారు. వరద గుప్పిట్లో చిక్కుకుపోవడంతో ఢిల్లీ నగరానికి మంచి నీటి సరఫరా చేసే మూడు ప్రదాన వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు మూతపడ్డాయి. దాంతో తాగునీటికి ఇబ్బంది ఏర్పడుతోంది.

Also read: Delhi Floods News Updates: ఢిల్లీలో వరదలు, కొనసాగుతున్న యమునా నది ఉధృతి.. పాఠశాలలకు సెలవులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News