Delhi Floods News Updates: ఢిల్లీలో భారీ వర్షాలకు తోడు యమునా నది ఉప్పోంగి ప్రవహిస్తుండటంతో హస్తీన వీధులన్నీ భారీ వరదలమయమయ్యాయి. గురువారం యమునా నది నీరు ఎర్రకోట గోడల వద్దకు పోటెత్తడంతో శుక్రవారం ఎర్రకోటలోకి సందర్శకులకు అనుమతి లేకుండా మూసేస్తున్నామని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం నుంచే ఎర్రకోటను మూసేస్తున్నట్టు ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తమ ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఈ నెల 16వ తేదీ వరకు మూసే ఉంటాయని ఢిల్లీ విద్యా శాఖ డైరెక్టర్ స్పష్టంచేశారు. ఢిల్లీలో భారీ వర్షాలు, వరదల తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి విద్యా శాఖ డైరెక్టర్ చేసిన ప్రకటన అద్దంపడుతోంది.
ఢిల్లీలో రహదారులు కాలువలను తలపిస్తున్నాయి. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత అధిక స్థాయిలో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. 45 ఏళ్ల చరిత్రలో 208.62 మీటర్ల ఎత్తుకు యమునా ప్రవాహం చేరుకోవడం ఇదే ప్రథమం అని రికార్డులు చెబుతున్నాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ డైరెక్టర్ శరద్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ, ఇవాళ సాయంత్రం 4 గంటల సమయానికి హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజ్‌లో నీటి ప్రవాహం 80 వేల క్యూసెక్కులకు తగ్గినట్టు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజాము 3 గంటల సమయానికి ప్రాజెక్టులోకి వరద ఉధృతి ఇంకొంత తగ్గే అవకాశం ఉంది అని అన్నారు.
దేశ రాజధాని మొత్తం వరదలమయమైన నేపథ్యంలో అత్యవసర వాహనాలు, నిత్యావసర సరుకులతో వెళ్లే వాహనాలు తప్పించి ఢిల్లీలోకి భారీ వాహనాలను అనుమతించేది లేదు అని ఢిల్లీ సర్కారు ఆదేశాలు జారీచేసింది. ఢిల్లీకి దారితీసే నాలుగు మార్గాల్లోనూ చెక్ పోస్టుల వద్ద నిఘా ఏర్పాటు చేసి ఆంక్షలు అమలు చేస్తోంది. రోడ్లపైకి వస్తోన్న వరద నీటితో ఇప్పటికే నగరం నలుమూలలా ట్రాఫిక్ స్తంభిస్తోంది. అత్యవసర పనులపై బయటికొచ్చిన వాహనదారులు సైతం ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని అవస్తలు పడుతున్నారు.
ఇది కూడా చదవండి : Delhi Traffic Jam: ఢిల్లీలో వరద బీభత్సం, భారీగా ట్రాఫిక్ జామ్
ఢిల్లీలో వరదల ప్రభావం ఢిల్లీ మెట్రో సేవలపై సైతం స్పష్టంగా కనిపిస్తోంది. యమునా నదిని ఆనుకుని ఉన్న యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్ లో మెట్రో ప్రయాణికులకు ఎంట్రీ, ఎగ్జిట్ మూసేశారు. ఢిల్లీలో మొత్తం నాలుగు చోట్ల ఢిల్లీ మెట్రో యమునా నదిని దాటాల్సి ఉంది. అయితే, ముందస్తు జాగ్రత్తగా యమునా బ్రిడ్జిల క్రాసింగ్ వద్ద గంటకు 30 కిమీ వేగం మించకుండా మెట్రో రైలును నడిపిస్తున్నట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి : Delhi Floods Updates: యమునా నది మహోగ్రరూపం, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటిని ముంచెత్తిన వరదలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK