Delhi Liqour Scam: బీజేపీలో చేరితే సీబీఐ, ఈడీ కేసులు ఎత్తేస్తామని ఆఫర్.. ఢిల్లీ డిప్యూటీ సీఎం సంచలనం

Delhi Liqour Scam: దేశ రాజధానితో  పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గంటకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. కేజ్రీవాల్ సర్కార్ వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని బీజేపీ ఆరోపిస్తుండగా.. ఆప్ నేతలు కౌంటరిస్తున్నారు

Written by - Srisailam | Last Updated : Aug 22, 2022, 12:45 PM IST
  • ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ట్విస్ట్
  • బీజేపీలో చేరాలంటూ ఎస్ఎంఎస్ - సిసోడియా
  • సీబీఐ, ఈడీ కేసులు తొలగిస్తామని హామీ
Delhi Liqour Scam: బీజేపీలో చేరితే  సీబీఐ, ఈడీ కేసులు ఎత్తేస్తామని ఆఫర్.. ఢిల్లీ డిప్యూటీ సీఎం సంచలనం

Delhi Liqour Scam: దేశ రాజధానితో  పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గంటకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. కేజ్రీవాల్ సర్కార్ వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని బీజేపీ ఆరోపిస్తుండగా.. ఆప్ నేతలు కౌంటరిస్తున్నారు. తనపై వస్తున్నఆరోపణలకు సంబంధించి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మరోసారి సంచలన  కామెంట్లు  చేశారు. ‘‘బీజేపీలో చేరితే నాపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులు ఎత్తివేస్తామని బీజేపీ నుంచి నాకు ఒక సందేశం వచ్చింది’’ అంటూ సిసోడియా ట్వీట్ చేశారు.  తాను తలనైనా తెగనరుక్కుంటానే కానీ.. బీజేపీ లో మాత్రం చేరబోనని చెప్పారు. మనీష్ సిసోడియా చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి.

లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసం సహా దేశంలోని పలు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు జరిపింది. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఆ కేసులో 14 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సిసోడియా ఏ1గా ఉన్నారు. సిసోడియాపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది సీబీఐ. లిక్కర్ స్కాంలో జరిగిన అవినీతికి సంబంధించి పక్కా ఆధారాలను సీబీఐ సేకరించిందని తెలుస్తోంది.  

ఢిల్లీ లిక్కర్ స్కాంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు వస్తున్నాయి. మద్యం కుంభకోణంలోకేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత కీలక రోల్ పోషించారని ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ ఆరోపించారు. ఢిల్లీ కొత్త ఎక్సైజ్ పాలసీని కేసీఆర్ ఫ్యామిలీ సన్నిహితులే రూపొందించారని అన్నారు.రు నెలల పాటు ఒబెరాయ్ హోటల్ బుక్ చేసుకున్నారని.. మనీష్ సిసోడియాతో పాటు అతని అనుచరులు, తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఇక్కడే ఉండి డీల్స్ చేశారని.. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తగ దగ్గర ఉన్నాయని చెప్పారు ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ

Also read:Pawan Fans Unhappy with Amit Shah: ఎన్టీఆర్ కు ఆహ్వానమా? అసంతృప్తితో పవన్ ఫాన్స్!

Also read:Amit Shah Munugode: కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొడతాం..కేంద్రమంత్రి అమిత్ షా హాట్ కామెంట్స్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News