Manish Sisodia: ఇది సామాన్యుడి విజయం, పంజాబ్ విజయంపై మనీష్ సిసోడియా

Manish Sisodia: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ పరాజయం మూటగట్టుకుంటోంది. పంజాబ్‌లో పార్టీ ఘన విజయంపై ఆ పార్టీ కీలకనేత మనీష్ సిసోడియా స్పందించారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 10, 2022, 01:51 PM IST
 Manish Sisodia: ఇది సామాన్యుడి విజయం, పంజాబ్ విజయంపై మనీష్ సిసోడియా

Manish Sisodia: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ పరాజయం మూటగట్టుకుంటోంది. పంజాబ్‌లో పార్టీ ఘన విజయంపై ఆ పార్టీ కీలకనేత మనీష్ సిసోడియా స్పందించారు.

పంజాబ్‌లో ఆప్ అనూహ్య విజయం సొంతం చేసుకుంది. భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. ఢిల్లీ తరువాత తొలిసారిగా రెండవ రాష్ట్రంలో అధికారం చేపట్టబోతోంది. అధికార కాంగ్రెస్ పార్టీని అధికారంలోంచి దించి పగ్గాలు చేపడుతోంది. పంజాబ్ రాష్ట్రంలో ఆప్ భారీ విజయంపై ఆ పార్టీ ముఖ్యనేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పందించారు. ఇది సామాన్యుల విజయమని మనీష్ సిసోడియా అభివర్ణించారు. అరవింద్ కేజ్రీవాల్ పాలన ఇప్పుడు జాతీయమైందని అన్నారు. కేజ్రీవాల్ నమూనా పంజాబ్‌కు ఓ అవకాశాన్ని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. 

పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఓ లాంఛనంగానే మారింది. మేజిక్ ఫిగర్ దాటి మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. గోవా, ఉత్తరాఖండ్, యూపీలో కూడా అభ్యర్ధుల్ని నిలబెట్టామని..పంజాబ్‌పై కాస్త ఫోకస్ ఎక్కువగా పెట్టామన్నారు. పంజాబ్ ప్రజలు తమ పార్టీని నమ్మినట్టే..ఇతర రాష్ట్రాల్లో కూడా నమ్ముతారని చెప్పారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశ్యంతో ప్రాధమిక సౌకర్యాలు, పాఠశాలలు, వైద్యం, ఉద్యోగాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. కచ్చితంగా పంజాబ్‌లో కూడా ఢిల్లీలాంటి పాలనే అందిస్తామని చెప్పారు. ఇది పార్టీ విజయం కాదని..సామాన్యుడి విజయమని స్పష్టం చేశారు. 

Also read: Punjab Election Results 2022: పంజాబ్‌లో ఆప్ విజయానికి కారణాలేంటి, కాంగ్రెస్ పతనానికి మూలమేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook   

Trending News