Vande Bharat Express Trains: దేశంలో కేంద్రం చారిత్రాత్మక మధ్యంతర బడ్జెట్ ను ఈరోజు (గురువారం) ప్రవేశ పెట్టింది. లోక సభ ఎన్నికలకు ముందు ప్రవేశ పెడుతున్న బడ్జెట్ కావడంతో ప్రతిఒక్కరిలోనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బడ్జెట్ లో అన్ని వర్గాల ప్రజలకు లాభదాయంకంగా ఉండేలా బడ్జెట్ ను రూపొందించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక ఈ బడ్జెట్ లో రైల్వేల మీద డెవలప్ మెంట్ కు కాస్తంతా ప్రయారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే మన దేశంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రజల్లో మంచి ఆదరణ లభించింది. తక్కువ సమయంలో వేగంగా, తమ గమ్యాలకు చేరుకోవడానికి ఉపయోగిస్తున్నారు. దీంతో ఈ రైలులో ఎక్కువ మంది ప్రయాణించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం బడ్జెట్ లో.. మరో నలభై వేల భోగీలను అప్ గ్రేట్ చేసేలా ప్లాన్ లు చేస్తున్నారు. అదే విధంగా.. మరింత ఆధునిక, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం కలిగేలా చర్యలు చేపట్టనున్నారు.
Read Also: Budget Facts: దేశంలో బడ్జెట్ గురించి ఆసక్తికరమైన అంశాలు, తొలి బడ్జెట్ ఆదాయం అంచనా ఎంతో తెలుసా
రానున్న మూడేళ్లలో.. మూడు కొత్త రైల్వే కారిడార్‌లను కూడా నిర్మిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రయాణీకుల ప్రయాణాలు సాఫీగా, మరింత ఆనందదాయకంగా ఉండేలా చూస్తుంది. అంతేకాకుండా, ప్రత్యేక కారిడార్ రద్దీని తగ్గిస్తుంది. ఈ కారిడార్లు.. సిమెంట్, ఖనిజాలు, పవర్ కోసం ఉంటాయన్నారు. అలాగే, మెట్రో, నమో భారత్ సేవలను పెద్ద నగరాలకు విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇటీవలి కాలంలో, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్త ఫీచర్లతో అప్ డేట్ అవుతూ, సమగ్ర మార్పులు వస్తున్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సరిపోయేలా సవరించబడే ఈ 40,000 బోగీలలో కూడా ఈ మార్పులు అప్ డేట్ అయ్యేలా చర్యలు చేపట్టారు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్: కొన్ని అప్ గ్రేడ్ లు..
1) ట్రైలర్ కోచ్‌లలో రంగు థీమ్‌ను పొందడానికి డ్రైవర్ డెస్క్
2) లోకో పైలట్‌కి సులభంగా యాక్సెస్ కోసం డ్రైవర్ కంట్రోల్ ప్యానెల్‌లో ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్‌ను మార్చుకోండి
3) కోచ్‌లలో ప్యానెల్ యొక్క దృఢత్వం కోసం మెరుగైన ఎగువ ట్రిమ్ ప్యానెల్
4) కోచ్‌ల లోపల FRP ప్యానెల్‌ల సింగిల్ పీస్ నిర్మాణం యొక్క సవరించిన ప్యానెల్‌లు
5) ప్యానెల్‌లపై ఇన్సులేషన్‌తో మెరుగైన ఎయిర్ కండిషనింగ్ కోసం ప్రత్యేక నిర్మాణాలు
6) కోచ్‌ల లోపల ఏరోసోల్ ఆధారిత ఫైర్ డిటెక్షన్, సప్రెషన్ సిస్టమ్ మెరుగుపరచబడింది
7) సారూప్య రంగులతో టాయిలెట్ ప్యానెల్‌లకు ప్రామాణిక రంగులు
8) ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఎరుపు రంగు థీమ్‌కు బదులుగా కొత్త 'ఆహ్లాదకరమైన నీలం' రంగు సీట్లు .
9) లావేటరీలలో నీరు చిమ్మకుండా ఉండటానికి వాష్ బేసిన్ లోతును పెంచండి
10) అన్ని క్లాస్‌ల సీటు రిక్లైనింగ్ కోణంలో పెరుగుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook