Maharashtra hospital fire accident: మహారాష్ట్ర ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం ఘటనలో11 కి చేరిన మృతుల సంఖ్య

Maharashtra hospital fire accident: మహారాష్ట్ర ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం కారణంగా 11 మంది మృతి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2021, 08:39 PM IST
Maharashtra hospital fire accident: మహారాష్ట్ర ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం ఘటనలో11 కి చేరిన మృతుల సంఖ్య

Maharashtra hospital fire accident: ముంబై: మహారాష్ట్రలోని అహ్మెద్ నగర్‌లో ఆస్పత్రి ఐసీయూలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 11కు చేరింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్టు మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే ప్రకటించారు. మహారాష్ట్ర ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం కారణంగా 11 మంది మృతి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ (PM Modi).. గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్విటర్ ద్వారా తెలిపారు. 

Also read : BJP MP Controversial Comments:మా నేతను అడ్డుకుంటే కళ్లు పీకేస్తా.. చేతులు నరికేస్తానంటూ వార్నింగ్

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సైతం ఈ ఘటనపై స్పందించారు. మహారాష్ట్ర అహ్మెద్ నగర్ ఘటన తీవ్రంగా కలచివేసిందని ట్వీట్ చేసిన రామ్‌నాథ్ కోవింద్.. మృతుల కుటుంబాలకు తన సంతాపం ప్రకటించారు. అలాగే ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం ఘటనలో (Maharashtra hospital fire accident) గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

x`x`

Also read : Rakesh Tikait: 'బీజేపీ, ఆరెస్సెస్​ ప్రజల ఐక్యతను దెబ్బతియాలనుకుంటున్నాయి జాగ్రత్త'

Also read : Yogi Adityanath: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఎక్కడి నుంచి పోటీ... ఇదీ ఆయన రియాక్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News