/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

భారత్‌లో ప్రాణాంతక కరోనా వైరస్ (CoronaVirus) తొలి మరణం నమోదైంది. కోవిడ్-19 (COVID-19) లక్షణాలతో ఇటీవల హైదరాబాద్‌లో మరణించిన వృద్ధుడికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ, కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి బి శ్రీరాములు ప్రకటించారు. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన 76 ఏళ్ల మహమ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ మంగళవారం చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో కరోనా అనుమానితుడు చనిపోయాడని, అతడికి పాజిటీవ్ వచ్చిందా లేదా అనేదానిపై సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 12న అది కరోనా వైరస్ మరణమేనని తేలిపోయింది.

మహమ్మద్ హుస్సేన్ ఫిబ్రవరి 29న సౌదీ అరేబియా నుంచి హైదరాబాద్ వచ్చాడు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్క్రీనింగ్ నిర్వహించగా కరోనా వైరస్ లక్షణాలు కనిపించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో మార్చి 6న ఆస్తమా, బీపీ సమస్యలతో అతడు ఇంటి దగ్గర్లో ఉన్న వైద్యుడిని సంప్రదించాడు. జ్వరం తగ్గకపోవడంతో మార్చి 9న మహ్మద్ హుస్సేన్‌ కలబుర్గిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. అక్కడ శాంపిల్స్ తీసుకుని పరీక్షల కోసం వైరల్ రీసెర్చ్ డయాగ్నోస్టిక్ లాబోరేటరీకి పంపించారు.

కరోనా వైరస్ పోయినా శానిటైజర్స్ వాడాల్సిందే.. ఎందుకో తెలుసా?

అయితే శాంపిల్స్ ఫలితాలు రాకముందే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు అతడ్ని తరలించారు. హైదరాబాద్‌లో తాత్కాలికంగా చికిత్స తీసుకున్న హుస్సేన్‌ను మధ్యలోనే డిశ్ఛార్జ్ చేసి కలబుర్గిగి తరలించాలనుకున్నారు. హైదరాబాద్ నుంచి గుల్బర్గా ఇన్ స్టిస్టూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (గిమ్స్), కలబుర్గికి తరలిస్తుండగా మార్చి 10న మార్గం మధ్యలోనే అతడు చనిపోయాడు.

రూ.299తో కరోనా ఇన్సూరెన్స్.. ప్రయోజనాలేంటో తెలుసా?

కాగా,  కలబుర్గి డిప్యూటీ కమిషనర్ (డీహెచ్ఓ) తొలుత కలబుర్గిలోని గుల్బర్గా ఇన్ స్టిస్టూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (గిమ్స్)లో హుస్సేన్‌ను ఐసోలేషన్ వార్డులో ఉంచి ట్రీట్ మెంట్ చేయాలని సూచించగా హాస్పిటల్ సిబ్బంది అందుకు నిరాకరించారు. మెరుగైన వైద్యం పేరుతో శాంపిల్స్ ఫలితాలు రాకముందే హైదరాబాద్‌కు తరలించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ట్వీట్ చేసింది.

టెస్ట్ శాంపిల్స్‌లో కోవిడ్19 పాజిటీవ్ అని తేలడంతో చేసిన తప్పునకు కలబుర్గి హాస్పిటల్ సిబ్బంది నాలుక కరుచుకున్నట్లు తెలుస్తోంది. తప్పును సరిదిద్దుకునేందుకు హుస్సేన్‌ను హైదరాబాద్ హాస్పిటల్ నుంచి డిశ్ఛార్జ్ చేయించి కర్ణాటకకు తీసుకెళ్లి ట్రీట్ మెంట్ ఇవ్వాలనుకోగా, మార్గం మధ్యలోనే కరోనా పేషెంట్ హుస్సేన్ చనిపోయినట్లు సమాచారం.

కరోనా వైరస్ మరిన్ని కథనాల కోసం క్లిక్ చేయండి

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Section: 
English Title: 
Death of a 76 year old male from Karnataka is first coronavirus death in india
News Source: 
Home Title: 

ఆ తప్పిదంతోనే భారత్‌లో తొలి కరోనా మరణం!

COVID-19 Deaths In India: ఆ తప్పిదంతోనే భారత్‌లో తొలి కరోనా మరణం!
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
COVID-19 Deaths In India: ఆ తప్పిదంతోనే భారత్‌లో తొలి కరోనా మరణం!
Publish Later: 
No
Publish At: 
Friday, March 13, 2020 - 07:21