TET certificate validity: టెట్ సర్టిఫికెట్ విషయంలో NCTE కీలక నిర్ణయం

NCTE decision on TET certificate validity: న్యూ ఢిల్లీ: టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (TET) రాయబోయే అభ్యర్థులకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) గుడ్ న్యూస్ చెప్పింది. టెట్ సర్టిఫికెట్ వ్యాలిడిటీ విషయంపై ఎన్సీటీఈ కీలక నిర్ణయం తీసుకుంది. టెట్ పరీక్షలో ఒకసారి అర్హత సాధిస్తే.. ఆ సర్టిఫికెట్ వ్యాలిడిటీ జీవితకాలం ఉంటుందని ఎన్సీటీఈ స్పష్టంచేసింది.

Last Updated : Oct 21, 2020, 04:18 PM IST
TET certificate validity: టెట్ సర్టిఫికెట్ విషయంలో NCTE కీలక నిర్ణయం

NCTE decision on TET certificate validity: న్యూ ఢిల్లీ: టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (TET) రాయబోయే అభ్యర్థులకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) గుడ్ న్యూస్ చెప్పింది. టెట్ సర్టిఫికెట్ వ్యాలిడిటీ విషయంపై ఎన్సీటీఈ కీలక నిర్ణయం తీసుకుంది. టెట్ పరీక్షలో ఒకసారి అర్హత సాధిస్తే.. ఆ సర్టిఫికెట్ వ్యాలిడిటీ జీవితకాలం ఉంటుందని ఎన్సీటీఈ స్పష్టంచేసింది. ఇప్పటివరకు అమలులో ఉన్న ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం టెట్ సర్టిఫికెట్ వ్యాలిడిటీ 7 సంవత్సరాలు మాత్రమే ఉండేది. Also read : SBI Clerk Prelims Result 2020: ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

తాజాగా NCTE తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇకపై TET పరీక్షలో అర్హత సాధించిన వారికి ఆ సర్టిఫికెట్ జీవిత కాలం చెల్లుబాటు కానుంది. ఈ నిర్ణయం ఇకపై టెట్ రాయబోయే అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుంది. గతంలో పరీక్ష రాసి అర్హత సాధించిన వారి సర్టిఫికెట్ వ్యాలిడిటీ విషయంలో కొత్తగా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని.. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఎన్‌సిటిఈ స్పష్టంచేసింది.

సెప్టెంబర్ 29న జరిగిన ఎన్సీటీఈ 50వ జనరల్ బాడీ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకోగా.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ( Minutes of the 50th Meeting of General Body of NCTE ) ఆమోదిస్తూ అక్టోబర్ 13న కౌన్సిల్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. Also read : SBI Clerk Mains Hall Ticket 2020: ఎస్‌బీఐ ‘క్లర్క్’ మెయిన్స్ హాల్‌ టికెట్లు విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News