Madhya Pradesh: ఆవు పేడ కొనే యోచనలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం, సీఎం వెల్లడి!

Cow dung: మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఆవు పేడను కొనే యోచనలో ఉన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2021, 04:03 PM IST
Madhya Pradesh: ఆవు పేడ కొనే యోచనలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం, సీఎం వెల్లడి!

Madhya Pradesh: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్(CM Shivraj Singh Chouhan) సంచలన ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం ఆవు పేడ(Cow dung)ను కొనే యోచనలో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. దాన్నుంచి ఎరువులు సహా ఇతర ఉత్పత్తులు తయారు చేసే ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. అలాగే పశుసంరక్షణ, చికిత్స నిమిత్తం ‘'109' నంబర్‌పై ప్రత్యేక అంబులెన్స్‌ సర్వీసులను కూడా ప్రారంభించేందుకు ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. ఏటా ‘ఇండియన్‌ వెటర్నరీ అసోసియేషన్‌’ జరిపే మహిళా పశువైద్యుల సదస్సు ‘'శక్తి 2021'(Shakti 2021)’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read: Sonu Sood Sister Moga: సోనూసూద్ కీలక ప్రకటన.. పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయనున్న సోనూ సోదరి

ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ..ఆవు పేడ, మూత్రంతో ఎరువులు, క్రిమిసంహారిణిలు, ఔషధాలు సహా ఇతర ఉత్పత్తులను తయారు చేయొచ్చని అన్నారు. ఈ నేపథ్యంలో గోవులు, వాటి పేడ, మూత్రం వల్ల కుటుంబాలు ఆర్థికంగా బలపడే అవకాశం ఉందని చెప్పారు. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ(strengthen Indian economy) సైతం పటిష్ఠమవుతుందన్నారు. మధ్యప్రదేశ్‌ శ్మశానాల్లో పిడకలను వినియోగిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గోశాలల్ని, సంరక్షణా కేంద్రాలను నెలకొల్పిందని పేర్కొన్నారు. అయితే, ప్రజల భాగస్వామ్యం లేనిదే అవి మనుగడ సాగించలేవని స్పష్టం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News