Corona Recovery Rate: కోవిడ్ ఉధృతి వేళ..ఊరట కల్గించే ప్రకటన

Corona Recovery Rate: కరోనా మహమ్మారి ధాటికి భారత్ చిగురుటాకులా వణికిపోతోంది. దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. దేశంలో భయంకరమైన కోవిడ్ పరిస్థితులు నెలకొన్న వేళ..కేంద్రం చేసిన ప్రకటన కాస్త ఊరటనిస్తోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 27, 2021, 12:40 PM IST
Corona Recovery Rate: కోవిడ్ ఉధృతి వేళ..ఊరట కల్గించే ప్రకటన

Corona Recovery Rate: కరోనా మహమ్మారి ధాటికి భారత్ చిగురుటాకులా వణికిపోతోంది. దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. దేశంలో భయంకరమైన కోవిడ్ పరిస్థితులు నెలకొన్న వేళ..కేంద్రం చేసిన ప్రకటన కాస్త ఊరటనిస్తోంది.

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) భయంకరంగా మారింది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో ఆక్సిజన్ కొరత( Oxygen shortage), బెడ్స్ కొరత, మందుల కొరత వెంటాడుతోంది. ఈ తరుణంలో కేంద్రం ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటన కాస్త ఊరట కల్గిస్తోంది. దేశంలో కోవిడ్‌-19 మరణాల రేటు ( Covid Mortality rate) చాలా తక్కువగా ఉందని కేంద్రం తెలిపింది. ఆదివారం దేశవ్యాప్తంగా 14.02 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా, వారిలో 3.54 లక్షల మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఇక సోమవారం కొత్తగా 2.20 లక్షల మంది కరోనా నుంచి బయటపడ్డారు.  

ఈ నేపధ్యంలో కేంద్రం ప్రకటనతో సెకండ్‌ వేవ్‌లో కరోనా తన ప్రతాపం చూపిస్తున్నా ఇప్పటి వరకూ మరణాల రేటు 1 శాతం మాత్రమే ఉందని, 99 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. కేంద్రం (Central government) తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలో మరణాల రేటు 1.12 శాతం ఉంటే, 98.88 శాతం మంది కరోనా నుంచి రికవరీ (Corona Recovery Rate) అవుతున్నారని, వారిలో  ఎక్కువ శాతం మంది ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక సెకండ్‌ వేవ్‌ ప్రారంభంలో 37శాతం మందికి వెంటిలేషన్‌ అవసరం కాగా, ఇప్పుడు 28 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇక వైరస్‌ వ్యాప్తికి హాట్‌‌స్పాట్‌‌గా ఉన్న మహరాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌‌లలో కరోనా కేసులు స్థిరంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

Also read: పంజాబ్‌లో రోజూ night curfew.. వారాంతాల్లో Weekend lockdown

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News