Covid 19 Cases Today: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,139 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 38 మంది కరోనాతో మృతి చెందారు. బుధవారం (జూలై 14)తో పోలిస్తే ఇవాళ 3233 (19.1 శాతం) కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,36,89,989కి చేరింది. ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 5,25,557కి చేరింది.
గడిచిన 24 గంటల్లో మరో 16,482 మంది పేషెంట్లు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా రికవరీల సంఖ్య 4,30,28,356కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 62.56 శాతం కేసులు కేరళ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లోనే నమోదవడం గమనార్హం. ఒక్క కేరళలోనే 17.6 శాతం కొత్త కేసులు నమోదయ్యాయి. బెంగాల్‌లో 2979, మహారాష్ట్రలో 2575, కర్ణాటకలో 1231, కేరళలో 3545, తమిళనాడులో 2269 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతందేశంలో కోవిడ్ రికవరీ రేటు 98.49 శాతంగా ఉంది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 1,99,27,27,559 కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వేశారు.
Also Read: Justice For Koratala Shiva: కొరటాల శివ సెటిల్మెంట్ వ్యవహారం ఏంటి?
Also Read:Sravana Masam 2022: శ్రావణ మాసంలో ఈ రాశులవారిపై కనకవర్షం!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook